JD Lakshmi Narayana : ఐపీస్ అధికారి అయిన వాసగిరి వెంకట లక్ష్మి నారాయణ గారు జేడీ లక్ష్మీనారాయణగా తెలుగు ప్రజలకు సుపరిచితులు. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్థుల కేసులో ఒకటైన ఓఎంసీ ఓబులాపురం మైనింగ్ కేసు, ఎమ్ఆర్ ప్రాపర్టీస్ కేసు లాంటి కేసులు దర్యాప్తుతో బాగా ఫేమస్ అయ్యారు. ఆ కేసులతో పాటు అంతకుముందు ఇలాంటి పొలిటీషియన్స్ చేసిన అవునీతి కుంభకోనాల కేసులనే లక్ష్మీనారాయణ డీల్ చేసారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణలో అవకతవకలు, అలానే సత్యం కుంభకోణం వంటి కేసులను దర్యాప్తు చేసారు లక్ష్మీనారాయణ. ఇక రిటైర్ అయ్యాక జనసేన పార్టీలో చేరిన ఆయన కొద్ది రోజులు అందులో పనిచేసినా ఆపైన ఆ పార్టీకి రాజీనామా చేసారు. ఆయన కెరీర్ లో ఎదుర్కొన్న విషయాలను లక్ష్మి నారాయణ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

తొమ్మిది నెలలు పోస్టింగ్ ఇవ్వలేదు…
జగన్ అక్రమాస్థుల కేసు దర్యాప్తుతో బాగా ఫేమస్ అయిన లక్ష్మి నారాయణ గారు ఆ తరువాత ఏపీ నుండి మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. అక్కడ రిపోర్టింగ్ కోసం డీజీ గారిని కలిస్తే వెళ్లి ఒకసారి హోమ్ మినిస్టర్ ను మీట్ అవ్వు అని చెప్పారట. ఒక పోలీస్ అధికారిగా నాకు బాస్ డీజి మీరు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా వెళ్లి చేస్తాను, నేను హోమ్ మినిస్టర్ ను కలవను అని చెప్పారట లక్ష్మి నారాయణ. అలా హోమ్ మినిస్టర్ ను కలవనందుకు దాదాపు 9 నెలలు పోస్టింగ్ ఇవ్వకుండా ఖాళీగా ఉంచారట. జీతం రాక ఇబ్బందులు పడినా వెళ్లి హోమ్ మినిస్టర్ ని మాత్రం కలవలేదట లక్ష్మి నారాయణ గారు.

ఇక పోస్టింగ్ వచ్చాక ఒక మినిస్టర్ సంబంధిచిన హోటల్ ను రాత్రి 11 తరువాత కూడా ఓపెన్ చేసి ఉంచడానికి పర్మిషన్ ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చారట, అయితే లక్ష్మి నారాయణ అందుకు ఒప్పుకోలేదట. కావాలంటే ప్రభుత్వం మీదే కనుక రాత్రి 11 తరువాత హోటల్స్ రెస్టారెంట్స్ ఓపెన్ చేసే అనుమతి ఇస్తే అయిపోతుంది కదా అంటూ పొలిటీషియన్స్ కూడా ఒక పోలీస్ అధికారిని పరీక్షస్తారు. రెండు లీగల్ పనులు ఒక ఇల్లీగల్ పని ఇచ్చి వీడు ఎలాంటి వాడు అని పరీక్షస్తారు. ఒకవేళ వాళ్ళ ఇల్లీగల్ పని చేయను అని చెబితే వాళ్ళను ట్రాన్సఫర్ చేయించడానికి ప్రయత్నిస్తారు అంటూ తెలిపారు.