Taraka Ratna -Vijay Sai Reddy: నారా లోకేష్ యువగలం పాదయాత్రలో అపశృతి చోటు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. నిన్న పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ కుమద్దతు తెలపడానికి తారకరత్న వెళ్లారు. అయితే ఉన్నఫలంగా ఈయన స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే తనని ప్రాథమిక చికిత్స అనంతరం సమీప ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి పీఈఎస్ ఆస్పత్రికి తరలించడంతో తారకరత్న గుండెపోటుతో బాధపడ్డారని వైద్యులు వెల్లడించారు.

ఈ విధంగా తారకరత్న గుండెపోటుకు గురయ్యారని తెలియడంతో అభిమానులు కాస్త కంగారుపడ్డారు. అయితే ఈయనని మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు.తారకరత్న గుండెపోటుకు గురి కావడంతో తన వ్యక్తిగత విషయాల గురించి కూడా పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే వైసిపి నాయకుడు ఎంపీ విజయసాయి రెడ్డికి తారకరత్నకు రిలేషన్ ఉందని తెలుస్తోంది.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి తారకరత్న వరసకు అల్లుడు అవుతారు. వీరిద్దరి మధ్య సమీప బంధుత్వం ఉందని తెలుస్తుంది.ఎంపీ విజయసాయిరెడ్డి భార్య సునంద సొంత చెల్లెలు కుమార్తె అలేఖ్య నందమూరి తారకరత్నను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ లెక్కన తారకరత్న విజయసాయిరెడ్డికి అల్లుడు అవుతారు.

Taraka Ratna -Vijay Sai Reddy: విజయ్ సాయి రెడ్డికి అల్లుడు వరస అవుతున్న తారకరత్న..
అలేఖ్య ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసేవారు. తారకరత్న నటించిన నందీశ్వరుడు చిత్రానికి కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. అయితే ఈయన ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అలేఖ్యతో ప్రేమలో పడటం అనంతరం వీరిద్దరూ హైదరాబాదులోని సంఘీ టెంపుల్ లో వివాహం చేసుకోవడం జరిగింది. ఇలా విజయసాయిరెడ్డి తారకరత్న ఇద్దరు బంధువులు అవుతారని తెలియడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.