త్వరగా ముసలితనం రాకుండా ఉండాలంటే.. ఇది పాటించాల్సిందే!

0
645

మన జీవిన విధానం.. తీసుకునే ఆహారాన్ని బట్టి ఎన్ని సంవత్సరాల వరకు బతకవచ్చు అనేది ఒక ప్రాధమిక నిర్ధారణకు రావచ్చు. దొరికే ప్రతీ ఒక్కటి పొట్టలోకి పంపిస్తే.. వ్యాధుల బారిన పడతారు. దీంతో వ్యాధులతో పాటు తొదరగా ముసలితనం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే.. దాని బారినుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒత్తిడి.. మనిసి ఒత్తిడికి గురవ్వడం అనేది సహజం.

కానీ ప్రతీ రోజు ఇలా చాల గంటల పాటు ఉంటే మాత్రం అది మెదడుపై ప్రభావం చూపి.. అల్టీమర్స్ తో పాటు ప్రాణాంతకమైన వ్యాధులు కూడా సంబవిస్తాయి. దీని ద్వారా కూడా ముసలితనం తొందరగా వస్తుంది.. కనుకు ఒత్తిడినిక లోనవకుండా చూసుకోవాలి.

దాని కోసం మెడిటేషన్ చేస్తే సరిపోతుంది. ఇక రెండోద నిద్ర.. సగటు మనిషికి నిద్ర అనేది దాదపు 6 నుంచి 8 గంటల వరకు అసవరం ఉంటుంది. నిద్ర లేకపోతే.. ఒత్తిడికి గురవుతాం.. దీంతో ముసలితనం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సరైన సమయంలో నిద్ర పోవడం అనేది మంచింది. ఇక రోజూ సరైన డైట్ పాటించాలి. లేదంటే శరీర బరువు పెరిగి.. ఒబెసీటీకి కారణం అవుతుంది.

సోడా, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల ముసలితనం త్వరగా వచ్చేస్తుంది. అందుకే మనకు మార్కెట్లో దొరికే పండ్లతో పాటు.. ఫైబర్ ఎక్కువగా ఉండే పదర్థాలను తీసుకోవాలి. అంతే కాకుండా రోజూ వ్యాయామం చేయాలి. ప్రతి రోజూ 20 నిమిషాల పాటు మీ యొక్క సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. ఇక అన్నింటికంటే.. ధూమపానం.. మద్యపానానికి దూరంగా ఉంటే.. ముసలితనం తొందరగా దరి చేరదనేది నిపుణులు చెబుతున్న మాట.