Kadapa: ఏపీ ఎన్నికల సమరానికి కేవలం వారం రోజులు మాత్రమే గడుపు ఉంది. ఈ క్రమంలోనే ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయ చర్చలు మొదలయ్యాయి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్న ఆసక్తి కూడా అందరిలో చాలా నెలకొందని చెప్పాలి. ఇకపోతే కడపలో ఈ రాజకీయ ఆసక్తి మరి కాస్త పెరిగింది అని చెప్పాలి.

కడపలో ఈసారి త్రిముఖ పోటీ ఉండబోతుందని తెలుస్తోంది. కడప పార్లమెంటు నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈయనకు పోటీగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైయస్ షర్మిల పోటీకి సిద్ధమయ్యారు.మరో వైపు టీడీపీ అభ్యర్థి కూడా సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నారు. అసలు వైఎస్ కుటుంబ పెత్తనం ఏంటి.. తరిమేద్దాం అన్న ఆలోచనలు చెబుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఇక ఇప్పటికే ఎంపిక కొనసాగుతున్నటువంటి అవినాష్ రెడ్డిని ఒక హంతకుడిగా షర్మిల చిత్రీకరిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలకు వెళ్తున్నారు అంతేకాకుండా ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ చట్టం కింద ప్రతి ఒక్క రైతు పాసు బుక్కుపై జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండటంతో భూములను కొట్టయేడం కోసమే ఈ చట్టం అమలులోకి తీసుకువచ్చారని పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేస్తున్నారు. దీంతో కడపలో కాస్త వ్యతిరేకత కూడా ఏర్పడిందని చెప్పాలి.
ఈ విధంగా కడపలో వైయస్ కుటుంబానికి వ్యతిరేకత వస్తున్నటువంటి తరుణంలో మరోవైపు షర్మిల తన అన్నయ్యలను విమర్శించడమే కాకుండా వివేకానంద రెడ్డి హత్య కేసును తరచూ ప్రస్తావనకు తీసుకువస్తూ తనని ఆశీర్వదించాలని తాను గెలిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని కేంద్రమంత్రి అవుతాం అంటూ షర్మిల ప్రచార కార్యక్రమాలలో తెలియజేస్తున్నారు.
షర్మిల జగన్ కి షాక్ ఇవ్వబోతోందా..
ఇకపోతే కడపలో తనకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కొంగు చాచీ మీ అందరి ఆడబిడ్డగా అభ్యర్థిస్తున్నాను అంటూ ఈమె సెంటిమెంట్ డైలాగులు కూడా చెప్పారు. ఇలా కొంగుచాచి అభ్యర్థిస్తున్నాను అంటూ ఈమె మాట్లాడటంతో అక్కడ ఉన్నటువంటి మహిళ ఓటర్లందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు ఈ కొంగు సెంటిమెంట్ కనుక వర్క్ అవుట్ అయితే కడపలో అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తప్పదని చెప్పాలి. మరి కొంగు సెంటిమెంట్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో తెలియాల్సి ఉంది.





























