Karate Kalyani : సినిమాలు లేకపోతే ఏంటి జనాలకు నిత్యం టచ్ లో ఉండటానికి సోషల్ మీడియా ఉందిగా. ఆ సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది వివాదాస్పద వ్యాఖ్యలు చేసైనా సరే వైరల్ అవుదాం అనుకుంటున్నారు. హిందూ మత పరిరక్షణ అంటూ మన కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. మత పరిరక్షణ పేరుతో ఇతర మాతాల వారిని రెచ్చగొడుతూ తాను సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇప్పుడు శరత్ బాబు గారి ఆరోగ్యం బాగోలేదని ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పోస్ట్ పెట్టింది కళ్యాణి. కానీ ఆ పోస్ట్ కి నెగెటివ్ కామెంట్స్ తో నెటిజన్స్ కామెంట్స్ పెట్టడమే విడ్డూరం.

నువ్వు పెట్టకు… బాగున్న వాళ్ళు కూడా పోతారు…
కరాటే కళ్యాణి మొన్నామధ్య తీవ్రంగా ట్రోల్ కి గురైంది. తన ఫేస్ బుక్ ఖాతా నుండి తెలిసీ తెలియక కోటా గారు మరణించారని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కొరుతూ పోస్ట్ పెట్టడం, కోట గారు నేను బ్రతికే ఉన్నాను అంటూ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే నా ఫోన్ ఇతరుల వద్ద ఉంది వాళ్ళు తెలియక పోస్ట్ పెట్టారు అంటూ కరాటే కవర్ చేసింది. అది నిజం కావొచ్చు కానీ ముందు వెనుక తెలుసుకోకుండా ఒక విషయాన్ని పెడితే సోషల్ మీడియాలో ఏమవుతుంది అనే ఆలోచన ఉండాలి కదా. కోటా గారి ఎపిసోడ్ లో చివరకు అందరికీ క్షమాపణలు చెప్పింది.

ఇక ఇప్పుడు తాజాగా కరాటే కళ్యాణి సీనియర్ నటుడు శరత్ బాబు గారికి ఆరోగ్యం బాగోలేదని ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పోస్ట్ పెట్టింది. అంతకు ముందు కరాటే చేసిన పనుల వల్ల నెటిజన్స్ నుండి చేదు అనుభవం ఎదురైంది. మీరు ఎవరిని కోలుకోవాలని ప్రార్ధిస్తే వాళ్లు టపా అంటున్నారు. మీకో దండం, ఏ శ్రీ రామ రక్షలు పని చేయవు కానీ, ఇలాంటి పోస్ట్ పెట్టకు అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీనికి కల్యాణి స్పందిస్తూ ఓక నెటిజెన్ కి కౌంటర్ వేస్తూ నీకు అలా అర్థమైందా.. అయితే నువ్వు త్వరగా కోలుకో నీకు మానసిక ఆరోగ్యం సరిగా లేనట్లుంది అంటూ పోస్ట్ పెట్టింది.