Lakshmi Parvathi : సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య గా అందరికీ తెలిసిన లక్ష్మి పార్వతి గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మళ్ళీ మీడియా ముందు తరచూ ఎన్టీఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తుంటారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి అవకాశం దొరికినపుడల్లా వెన్ను పోటు అంటూ ఉపన్యాసాలు ఇస్తుంటారు. మొన్నామధ్య జగన్ నాకు జీవితాన్ని ఇచ్చాడు అంటూ ఎన్టీఆర్ వర్ధంతి నాడు మాట్లాడిన లక్ష్మి పార్వతి గారు మరోసారి లోకేష్ పాదయాత్ర గురించి కామెంట్స్ చేస్తూ లీడర్ అంటే జగన్ అంటూ మాట్లాడరు.

బలవంతంగా రుద్దితే లీడర్లు కాలేరు…
లోకేష్ పాదయాత్ర గురించి లక్ష్మి పార్వతి మాట్లాడుతూ చిన్నప్పటి నుండి లోకేష్ చాలా సుకుమారంగా పెరిగాడని అంత దూరం నడవలేక పోతున్నాడు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. చిన్నప్పటి నుండి కష్టమంటే ఏంటో తెలియకుండా కోట్లల్లో పెరిగిన లోకేష్ ఇలా కష్టపడాలంటే ఇబ్బంది ఉంటుంది. అయిన తండ్రి బాగా సంపాదించాడు, ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు, అది వదిలేసి బలవంతంగా లీడర్ అవడం ఎందుకు.

బలవంతంగా రుద్దితే లీడర్ అయిపోరు అది మనకు పుట్టుక నుండే ఉండాలి. ఎన్టీఆర్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి స్వతహాగా పార్టీ పెట్టుకుని లీడర్లుగా ఎదిగారు. జనంలో ఒకరిగా ఉండి వాళ్ళు లీడర్లుగా ఎదిగారు. అందరూ అలా లీడర్లు కాలేరు అంటూ లోకేష్ మీద సటైర్లు వేశారు.