School Bus Driver: ఈ మధ్యకాలంలో ప్రతి పది మందిలో ఐదు మంది బాధపడుతున్నటువంటి సమస్యలలో గుండెపోటు సమస్య ఒకటి. చిన్నపిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వారి వరకు ఈ గుండెపోటు సమస్య ఎంతగానో బాధిస్తోంది.ఇలా గుండెపోటు సమస్యతో ప్రతి సంవత్సరం కొన్ని వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.

తాజాగా గుజరాత్ లోని రాజ్ కోట్ లో శనివారం ఉదయం విద్యార్థులతో ఓ స్కూల్ బస్సు రోడ్డుపై వెళ్తుంది. ఆ స్కూల్ బస్సు గొండాల వద్దకు చేరుకోగానే హఠాత్తుగా ఆ బస్సు డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. ఈ విధంగా బస్సు డ్రైవర్ కు గుండెపోటు రావడం గమనించినటువంటి విద్యార్థి భార్గవి బస్సు స్టీరింగ్ తిప్పుతూ బస్సును ఒక కరెంటు స్తంభానికి ఢీ కొట్టింది.
ఈ విధంగా బస్సు స్తంభానికి ఢీ కొట్టి ఆగిపోయింది. దీంతో బస్సులో ఉన్నటువంటి ఏ ఒక్క విద్యార్థికి కూడా చిన్నపాటి గాయాలు కాలేదు. అయితే ఇది గమనించినటువంటి స్థానికులు హుటాహుటిన బస్సు డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి కాస్త స్థిమితంగా ఉందని తెలుస్తోంది.

School Bus Driver: చిన్నారుల ప్రాణాలను కాపాడిన భార్గవి…
ఇలా డ్రైవర్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురి కావడంతో భార్గవి అనే విద్యార్థి ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంతో ఎంతోమంది విద్యార్థుల ప్రాణాలను కాపాడిందని లేకపోతే ఘోర ప్రమాదం చోటుచేసుకునేది అంటూ నేటిజన్స్ విద్యార్థి భార్గవి పై ప్రశంసల కురిపిస్తున్నారు.