కారు కోసం 40 రోజులు ఉపవాసం.. దేవుడు ఇస్తాడని అడవిలో తపస్సు!

0
163

కారు కొనాలనిది ప్రతి ఒక్కరికి ఉండే కల. అయితే ఈ కలను నిజం చేసుకోవాలంటే ఎంతో సులభం. ఈఎంఐల ద్వారా మన సొంత కారు దు కలను నిజం చేసుకోవచ్చు. కానీ స్పోర్ట్స్ కారు కొనాలంటే మన ఆస్తులను అమ్ముకోవాల్సిందే. ఎంతో ధనవంతులు మాత్రమే ఇలాంటి కార్లను కొనగలరు.జింబాబ్వేలోని రిసెన్ సైంట్స్ చర్చ్‌కు చెందిన వ్యక్తి మాత్రం స్పోర్ట్స్ కారు కొనాలంటే డబ్బులు పెట్టాల్సిన పని లేదని కేవలం 40 రోజులు ఉపవాసం చేస్తే దేవుడు కారు ఇస్తాడని, ఈ విధంగా తనకు ఇష్టమైన కారు కొనడం కోసం 40 రోజుల పాటు దీక్ష చేయడానికి పూనుకున్న ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

జింబాబ్వేలోని రిసెన్ సైంట్స్ చర్చ్‌కు చెందిన నాయకుడు మార్క్ మార్దాజిరాకు తన ప్రియురాలి కోసం బహుమతిగా ఇవ్వడానికి లంబోర్ఘిని స్పోర్ట్స్ కొనాలని ఆశ. అయితే, తన కోరికను కేవలం భగవంతుడి తీరుస్తాడని నమ్మకం. ఈ విధంగా దేవుడిపై భారం చేస్తే 40 రోజుల పాటు ఉపవాస దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.

చాలామంది స్నేహితులు ఇలాంటి వాటిని పొందాలంటే దేవుడిపై భారం వేయకూడదు సొంత కష్టాన్ని నమ్ముకోవాలని సూచించారు. అయితే అందుకు రీసెన్ తన నిరుద్యోగిని తాను కోరుకున్న కారు కొనుక్కోవాలంటే 1.45 కోట్లు ఖర్చు చేయలేనని తెలిపాడు. అందుకోసమే ఉపవాస దీక్షతో దేవుడి కరుణతో ఆ కారు పొందాలని నిర్ణయించుకున్నాడు.

ఇంట్లో అయితే తన ఉపవాస దీక్షకు ఇతరులు ఆటంకం కలిగిస్తారనే అనుమానంతో ఋషులు, మునులు ఏకాంతంగా తపస్సు చేసే పర్వతాలలో దీక్ష చేయాలనే అనుకున్నాడు. ఈ క్రమంలోనే పర్వత ప్రాంతాలలోకి వెళ్లి ఉపవాసంతో దీక్ష చేశాడు.అతడు అనుకున్నట్టుగా కారు రాలేదు కానీ ఇన్ని రోజుల పాటు ఆహారం తినకపోవడం వల్ల ఎంతో నిరసించిపోయాడు. అతడి ఆచూకీ తెలుసుకుని అతనికి ఆహారం తినిపించాలని ఎన్నోసార్లు తమ స్నేహితులు ప్రయత్నించగా చివరికి అతని ఆచూకీ దొరికింది. ఇన్ని రోజుల పాటు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల నీరసించిపోయిన తననీ స్నేహితులు బిందురా జనరల్ హాస్పిటల్‌లో చేర్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు అతనికి చివాట్లు పెడుతున్నారు. ఈ ప్రయత్నం మీరు ఉద్యోగం కోసం ప్రయత్నించి ఉంటే మంచి ఉద్యోగం దొరికేది కదా అంటూ మరి కొందరు సలహాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here