Manchu Vishnu VS Manoj: మనోజ్.. విష్ణు గొడవలపై స్పందించిన మోహన్ బాబు సతీమణి… ఎలాంటి గొడవలు లేవంటూ కామెంట్స్!

0
166

Manchu Vishnu VS Manoj: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ గా మారింది అంటే అది మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదాలే అని చెప్పాలి. గత కొద్ది రోజులుగా మంచు మనోజ్ పెళ్లి గురించి ఈ ఫ్యామిలీ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా మనోజ్ విష్ణు మధ్య చోటు చేసుకున్నటువంటి గొడవ కారణంగా మరోసారి మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలిచింది.

మనోజ్ విష్ణు గొడవ పడటం అందుకు సంబంధించిన వీడియోని మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ఇలా ఈ విషయంపై ఇదివరకే మోహన్ బాబు స్పందించి అన్నదమ్ముల మధ్య ఇలాంటి గొడవలు సర్వసాధారణమని తెలిపారు. మోహన్ బాబు సూచనల మేరకే మనోజ్ వీడియోని డిలీట్ చేశారని తెలుస్తోంది.

ఇక విష్ణువు మనోజ్ గొడవలపై మంచు లక్ష్మి స్పందిస్తూ తనుకు అసలు గొడవ గురించి ఏమాత్రం తెలియదని తెలియకుండా తాను ఏమీ మాట్లాడనని తెలిపారు. అయితే తాజాగా ఈ గొడవ గురించి మోహన్ బాబు సతీమణి నిర్మల స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన కొడుకుల మధ్య ఎలాంటి గొడవలు లేవంటూ కామెంట్ చేశారు.

Manchu Vishnu VS Manoj:మనోజ్ పెళ్లి విష్ణుకి ఇష్టం లేదా…

ఇలా మంచు ఫ్యామిలీ ఈ విషయాన్ని చాలా సింపుల్ గా తీసుకుందని తెలుస్తోంది. అయితే విష్ణు మనోజ్ మధ్య గత కొంతకాలంగా మాటలు లేవనే వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. ఇలా వీరిద్దరి మధ్య మాటలు లేకపోవడం వల్లే మనోస్ పెళ్లికి కూడా విష్ణు అతిథి లాగా వచ్చారని తెలుస్తోంది. ఇక మనోజ్ విష్ణు మాట్లాడకపోవడానికి కారణం మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడమే కారణమని తెలుస్తుంది.