Rashmika: ప్రతిరోజు పని వాళ్ళ కాళ్లు మొక్కుతా… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి రష్మిక!

0
101

Rashmika: రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలను అందుకుంటు బిజీగా గడుపుతున్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఇలా వరుస సినిమాలకు కమిట్ అవుతూ తన సినిమాకు సంబంధించిన విషయాలను మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను చిన్న చిన్న విషయాలను కూడా చాలా కీలకంగా తీసుకుంటానని తెలిపారు.

ఇక మనం మాట్లాడే మాటలకు ఎంతో శక్తి ఉందని ఒక మనిషి మనసు విరి చేయడానికి మాటలు చాలంటూ ఈమె తెలిపారు. అందుకే మనం మాట్లాడే ప్రతి మాట ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు.నా జీవితంలో జరిగే ప్రతి సంఘటనను తాను డైరీలో రాసుకుంటానని తెలిపారు. ఇక పని ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత గౌరవంతో తాను ప్రతి ఒక్కరి పాదాలను టచ్ చేస్తానని తెలిపారు.

Rashmika: మనుషులను వేరు చేయడం రాదు…

తన ఇంట్లో పనిచేసే పని వాళ్లకు కూడా ఈమె పాదాభివందనాలు చేసి వారి ఆశీర్వాదం తీసుకుంటానని తెలిపారు. తనకు మనుషులను వేరు చేసి చూడటం రాదని, తనకు ఒక మనిషిగా సాటి మనుషులను గౌరవించడమే తెలుసు అందుకే తాను ప్రతి రోజు తన ఇంట్లో పని వాళ్లకు కాళ్లు మొక్కుతాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.