చెర్రీ సినిమా పై యూటర్న్ తీసుకున్న డైరెక్టర్ శంకర్.. ఫాన్స్ ఆశలను అడియాశలు చేస్తూ..?

0
191

తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ వారసుడిగా.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ కేవలం అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో ఇమేజ్ ను సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలపై దృష్టి సారించిన ఈ హీరో వరుస సినిమా అవకాశాలను దక్కించుకున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “RRR” చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ సందడి చేయనున్నారు.అదేవిధంగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో తన తండ్రితో కలిసి వెండితెరను పంచుకోనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే చెర్రీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడని వార్తలు జోరుగా వినిపించాయి.

అత్యంత భారీ బడ్జెట్ తో ఏకంగా ఆరు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించి ఎంతో అట్టహాసంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే చిత్ర బృందం ప్లాన్ చేశారు. శంకర్ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే శంకర్ చెర్రీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రామ్ చరణ్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను చిత్ర బృందం ముందుగా ఆరు భాషలలో విడుదల చేయాలని భావించారు. అయితే తాజాగా ఈ సినిమాను కేవలం హిందీ, తెలుగు, తమిళ భాషలలో మాత్రమే విడుదల చేయాలని చిత్రబృందం భావించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానుల ఆశలపై శంకర్ నీళ్లు చల్లినట్లు అయ్యింది.ఈ క్రమంలోనే అభిమానులు శంకర్ చెర్రీ సినిమా విషయంలో ఎందుకిలా యూటర్న్ తీసుకున్నాడనే సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here