Connect with us

Political News

ఇంద్రవెల్లి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు_ సీతక్క

Published

on

ఆదిలాబాద్ ఇంద్రవెల్లి సభను విజయవంతం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే సీతక్క ధన్యవాదాలు తెలియజేశారు.ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెళ్లి సభను విజయవంతం చేసిన ప్రజలకు, నేతలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల వచ్చిన ప్రతిసారి తెరాస ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. హుజూరాబాద్​ ఉపఎన్నిక కోసమే సీఎం కేసీఆర్ దళిత బందు తీసుకు వచ్చారన్నారు.

కాగా గిరిజనుల పోడు భూములకు పట్టాల కోసం గత కొంత కాలంగా కాంగ్రెస్​ పార్టీ పోరాడుతోందని సీతక్క పేర్కొన్నారు. పోడు భూములకు కాంగ్రెస్​ హక్కులు కల్పించిందని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరికి పట్టాలు ఇవ్వకుండా.. ఉన్న భూమిని లాక్కుంటున్న చరిత్ర కేసీఆర్​ది అని విమర్శించారు.

Advertisement

Featured

Pawan Kalyan: వారాహి దీక్షలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేసిన పవన్.. ఫోటోలు వైరల్!

Published

on

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా అలాగే మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈయన ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత 11 రోజులపాటు వారాహి అమ్మవారి దీక్ష వేశారు. గత నెల 25వ తేదీ ఈ దీక్ష వేశారు. అయితే ఈ దీక్షలో భాగంగా ఇటీవల సూర్య భగవానుడికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోనే జనసేన పార్టీ కార్యాలయంలో ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సూర్యరాదనలో భాగంగా ఆదిత్య యంత్రం ఏర్పాటు చేసి దీని ఎదుటు ఆశీనులైన జనసేన అధినేత ప్రత్యక్ష భగవానుడిని వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూజించారు.

ఇలా సూర్యభగవానుడిని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇక ఈయన సమాజ శ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారని తెలుస్తుంది. పూజా కార్యక్రమాలలో భాగంగా ఈ పూజ విశిష్టత గురించి పండితులు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

రాష్ట్ర సంక్షేమం కోసం..
ఇక పవన్ కళ్యాణ్ గతంలో ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తూ సూర్య భగవానుడిని ఆరాధించే వారట. అయితే ప్రస్తుతం దీక్షలో ఉన్నటువంటి ఈయన సూర్య నమస్కారానికి బదులుగా సూర్య నమస్కారాలకు సంబంధించి మంత్ర సహిత ఆదిత్య ఆరాధనను వారాహీ దీక్షలో భాగంగా అత్యంత ఘనంగా నిర్వర్తించారు.

Advertisement
Continue Reading

Featured

YS Jagan: నెల్లూరు జైలుకు వైయస్ జగన్.. ఆ వైసీపీ నేతతో మూలఖత్?

Published

on

YS Jagan: వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జులై 4వ తేదీ నెల్లూరు జైలుకు వెళ్లబోతున్నారు. నెల్లూరు జైలులో రిమాండ్ లో ఉన్నటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈయన పరామర్శించడానికి వెళ్తున్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈయనకు 14 రోజులపాటు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే పిల్లలతో ఇప్పటికే కొంతమంది వైసీపీ కీలక నేతలు మూలాఖత్ అయ్యారు. అయితే తాజాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం నెల్లూరు జైలుకు వెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించబోతున్నట్లు తెలుస్తోంది.

జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో విజయం తమదేనని చాలా ధీమా వ్యక్తం చేశారు కానీ ఫలితాలు ఊహించిన విధంగా రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఈ విషయం నుంచి ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారని తెలుస్తోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను తిరిగి పరామర్శించడానికి అలాగే ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలని కేడర్ కి సూచించడమే కాకుండా కార్యకర్తలకు అండగా ఉండాలని కూడా తెలిపారు.

Advertisement

పిన్నెల్లితో మూలాఖత్…

ఇక త్వరలోనే తాను ప్రజలలోకి రాబోతున్నానని జగన్ వెల్లడించారు. ఈ తరుణంలోనే ముందుగా అరెస్టయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈయన పరామర్శించబోతున్నారు. ఇన్ని రోజులపాటు బెంగళూరులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటీవల తాడేపల్లికి చేరుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక తాడేపల్లి నుంచి నేరుగా నెల్లూరుకు హెలికాప్టర్లో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గాన జైలుకు వెళ్లబోతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Ambani Family: సామూహిక వివాహాలు చేసిన అంబానీ కుటుంబం.. కానుకల లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Published

on

Ambani Family: భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే.తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహం మరికొద్ది రోజులలో జరగబోతుంది వీరి వివాహం జులై 12వ తేదీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఇలా తన కొడుకు పెళ్లి కావడంతో ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు ఎంతోమంది పేదవారికి సామూహిక వివాహాలు జరిపించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సామూహిక వివాహాలు జరిపించిన అనంతరం వధూవరులకు ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు ఇచ్చిన కానుకులకు సంబంధించిన వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. పెళ్లి చేసుకున్న వధూవరులకు మంగళసూత్రంతో పాటు ఉంగరాలను అలాగే కొన్ని వెండి వస్తువులను కానుకగా అందజేశారు.

వీటితోపాటు ప్రతి వధువుకు ‘స్త్రీధన్’గా రూ. 1.01 లక్షల చెక్కును అందించారు. జంటలకు సంవత్సరానికి సరిపడా కిరాణా సామాగ్రి, గృహోపకరణాలను కూడా పొందారు. ఇందులో వివిధ రకాలైన 36 అవసరమైన వస్తువులు, పాత్రలు, గ్యాస్ స్టవ్, మిక్సర్, ఫ్యాన్ వంటి వస్తువులను కానుకగా అందజేయడమే కాకుండా పెళ్లి తర్వాత వివిధ రకాల వంటలతో విందు భోజనాలను కూడా ఏర్పాటు చేశారు.

Advertisement

లక్షల విలువ చేసే కానుకలు..
ఇలా సామూహిక వివాహాలు జరపడంతో పాటు వధూవరులకు ఈ స్థాయిలో కానుకలు అందజేశారు అంటే అంబానీ రేంజ్ ఏమిటో అక్కడే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక తన కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుకలలో భాగంగా పలువురు సెలబ్రిటీలందరూ కూడా భాగం కాబోతున్నారని తెలుస్తుంది. ఈ వివాహాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరిపించబోతున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!