పట్టపగలు కదులుతున్న ట్రక్కును దోచేసిన దొంగలు.. ఎక్కడంటే?

0
106

సాధారణంగా దొంగతనం చేయాలంటే దొంగలు రాత్రి సమయాలలో ప్లాన్ చేస్తారు. మరి పట్టపగలు దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది.ఈ విధంగా పట్టపగలు దొంగతనం చేసి దొరకకపోతే ఆ కిక్కే వేరు ఉంటుంది.కాని దొరికిపోతే ఆ ధారునమైన పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదివరకు “ధూమ్”, “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్”వంటి సినిమాలలో కదులుతున్న వాహనాలలో ఉన్న అధిక మొత్తం నగదును దొంగలించే సీన్లను మనం చూసే ఉంటాం.

అచ్చం ఈ సినిమాల్లో మాదిరిగానే కదులుతున్న వాహనం నుంచి దొంగతనం జరిగిన ఘటన తాజాగా ఒకటి చోటు చేసుకుంది. అయితే ఈ దొంగతనం సినిమా అంత రేంజ్ లో కాక పోయినా, ఈ దొంగలు చేసిన దొంగతనం చూస్తే ఎంతో సరదాగా అనిపిస్తుంది. ఇంతకీ ఆ దొంగతనం ఏంటి? సరదాగా అనిపించడం ఏంటని ఆలోచిస్తున్నారా..

ఒక ట్రక్కు మామిడి పండ్లను తీసుకొని రోడ్డుపై వెళుతోంది. అయితే అందులో మామిడి పండ్లు ఉన్నాయని గమనించిన కోతులు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రయాణిస్తున్న ఆ ట్రక్ పైకి ఎగ బడ్డాయి. కొన్ని కోతులు గుంపులు గుంపులుగా వచ్చి కదులుతున్న ఆ ట్రక్ లో ఉన్న మామిడి పండ్లను తీసుకొని వెళ్లాయి.

ఇది చూసిన మరి కొన్ని కోతులు కూడా మామిడి పండ్ల కోసం అదే పని చేశాయి. ఈ మామిడి పండ్ల కోసం కోతులు చేసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ స్మార్ట్ దొంగతనం చూసి మీరు కూడా ఆనందించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here