Nithin: టాలీవుడ్ యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నితిన్ గత మూడు సంవత్సరాల క్రితం శాలిని అనే అమ్మాయిని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇలా మూడు సంవత్సరాలు పాటు వైవాహిక జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నటువంటి నితిన్ షాలిని దంపతులు తాజాగా మూడవ పెళ్లిరోజు వేడుకలను ఎంత ఘనంగా జరుపుకున్నారు.

ఈ పెళ్లి రోజు వేడుకలలో భాగంగా ఈ దంపతులు బార్సిలోన వెకేషన్ వెళ్లారు.ఈ వెకేషన్ లో భాగంగా వీరిద్దరూ కలిసి దిగినటువంటి ఫోటోలను శాలిని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నితిన్ తండ్రి కాబోతున్నారు అంటూ ఓ వార్త వెలుగులోకి వచ్చింది.
ఈ ఫోటోలలో భాగంగా నితిన్ కౌగిలిలో శాలిని బంది అయినటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ మూడేళ్ల ఎంతో అందంగా గడిచాయి థాంక్యూ సో మచ్ అంటూ ఒక ఫోటోని షేర్ చేశారు. అయితే ఈ ఫోటో చూస్తే కనుక శాలిని ప్రెగ్నెంట్ అని సందేహాలు రాకమానదు. ఈ ఫోటోలలో ఈమె బేబీ బంప్ తో ఉన్నట్టు కనపడుతుంది. ఇలా ఈ ఫోటో వైరల్ గా మారడంతో పలువురు నితిన్ తండ్రి కాబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలను వైరల్ చేస్తున్నారు.

Nithin: బార్సిలోన వెకేషన్ లో నితిన్ దంపతులు..
నిజంగానే నితిన్ తండ్రి కాబోతున్నారా లేదా అన్న విషయం తెలియాలి అంటే ఈ విషయంపై నితిన్ స్పందించాల్సిన అవసరం ఉంది.ఇకపోతే నితిన్ సినిమాల విషయానికొస్తే ఈయన మాచర్ల నియోజకవర్గం సినిమా ద్వారా చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ సాధించలేక పోయింది ప్రస్తుతం వక్కంతం వంశీ వెంకీ కుడుముల సినిమాలతో నితిన్ ఎంతో బిజీగా ఉన్నారు