ఈ మధ్య కాలంలో అరుదైన నాణేలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. కొన్ని వెబ్ సైట్లు ఆన్ లైన్ ద్వారా అరుదైన నాణేలను, పాత నోట్లను వేలం వేసి వేల రూపాయలు, లక్షల రూపాయలు సొంతమయ్యేలా చేస్తున్నాయి. అతిపెద్ద ఆన్‌లైన్‌ మార్కెట్‌ సంస్థ ఇండియామార్ట్‌ రూపాయి నాణేనికి ఏకంగా ధరను 25 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. ఈ అరుదైన నాణెం మీ దగ్గర కూడా ఉంటే అంతే మొత్తాన్ని మీరు కూడా సొంతం చేసుకోవచ్చు.

 

ఒక రూపాయి నాణెం మీ దగ్గర ఉంటే నిమిషాల వ్యవధిలో సులువుగా లక్షాధికారి కావచ్చు. కనీసం వందేళ్ల కిందటి నాణేలు ఉన్నవాళ్లు ఆన్ లైన్ ద్వారా లక్షల రూపాయలను పొందవచ్చు. 25 లక్షల రూపాయలుగా ధర నిర్ణయించిన పాత నాణెం 1913 సంవత్సరానికి చెందింది. విక్టోరియా కాలం నాటి ఈ నాణేన్ని వెండితో తయారు చేశారు. ఇండియా మార్ట్ వెబ్ సైట్ లో ఈ నాణెంతో పాటు మరికొన్ని నాణేలు కూడా ఇదే స్థాయిలో పలుకుతున్నాయి.

ఇండియా మార్ట్ వెబ్ సైట్ లో 18వ శతాబ్ధం నాటి నాణెం ధరను పది లక్షలుగా , 1818 ఈస్టిండియా కంపెనీ తయారుచేసిన నాణేన్ని కూడా పది లక్షల రూపాయలుగా నిర్ణయించారు. హనుమంతుడి బొమ్మ ఈస్ట్ ఇండియా కంపెనీ 1818లో నాణేన్ని విడుదల చేసింది. మీరు కూడా మీ దగ్గర పురాతన నాణేలు, నోట్లు, 786 సిరీస్ ఉన్న నోట్లు ఉంటే ఇండియామార్ట్‌.కాం వెబ్ సైట్ ను సంప్రదించి విక్రయించవచ్చు.

పాత నాణేలను, నోట్లను విక్రయించాలని అనుకున్న వారు మొదట రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత నాణేలకు సంబంధించిన ఫోటోలను తీసి సేల్ చేయవచ్చు. పురాతన నాణేల పట్ల ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ లో తమ దగ్గర పాత కాయిన్లను, పాత నోట్లను సేల్ చేసి లక్షల రూపాయలు సొంతం చేసుకుంటూ ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here