Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిచయం అవసరం లేని పేరు. నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అదే విధంగా మరో వైపు రాజకీయాలలో భాగంగా వారాహి యాత్ర చేస్తూ కూడా బిజీగా ఉన్నారు.

ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే కొందరు పవన్ కళ్యాణ్ ను అభిమానించగా మరికొందరు దైవ సమానం అంటూ ఆయనని పూజిస్తూ ఉంటారు. ఇలా పవన్ కళ్యాణ్ పట్ల తమకు ఉన్నటువంటి అభిమానాన్ని అభిమానులు పలు సందర్భాలలో ప్రదర్శిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే పవన్ అభిమాని ఏకంగా చేతితో పవన్ కళ్యాణ్ ఫోటో గీసారు. అయితే ఇందులో ఏమంత వింత ఉంది అనుకోవచ్చు ఇప్పటివరకు ఎంతోమంది ఇలాంటి పనిచేసే ఉంటారు కానీ ఈ ఫోటో మాత్రం చాలా ప్రత్యేకమైన చెప్పాలి.పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన బ్రో సినిమా నుంచి ఆయన లుక్ కి సంబంధించిన ఒక ఫోటో అభిమాని చేతితో వేశారు.

Pawan Kalyan: వేళల్లో అమ్ముడుపోయిన పవన్ ఫోటో…
ఇలా పవన్ కళ్యాణ్ ఫోటో గీయడంతో అమెరికాకు చెందిన మరొక పవన్ కళ్యాణ్ అభిమాని ఈ ఫోటోని ఏకంగా 520 డాలర్లు అంటే మన రూపాయల్లో 43,241 రూపాయలుపెట్టి కొనుగోలు చేయడం విశేషం అయితే ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీ ఏ ఒక్క హీరో ఫోటో కూడా ఈ స్థాయిలో అమ్ముడుపోలేదు. దీంతో పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రమే ఈ స్థాయిలో ధర పలుకుతూ అమ్మడుపోవడంతో అది పవన్ స్టామినా అంటూ అభిమానులు వైరల్ చేస్తున్నారు.