ఎనిమిదేళ్ల తర్వాత ఆ పని చేయనున్న పూజా హెగ్డే!

0
119

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటిస్తూ విజయపథంలో దూసుకుపోతున్న పూజాహెగ్డే ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు. మరోవైపు బాలీవుడ్ సినీ పరిశ్రమలో కూడా మంచి విజయాలను అందుకుంటూ చేతి నిండా సినిమాలతో ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు పూజా హెగ్డే. 2012 వ సంవత్సరంలో కోలీవుడ్‌లో చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన ‘ముగముది’సినిమా ద్వారా నటిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం కోలీవుడ్‌లో ‘ముగముది’ అనే సినిమాలో నటించిన తరువాత ఎటువంటి కొత్త ప్రాజెక్టులను చేయలేదు. ఎనిమిదేళ్లలో ఇటు తెలుగు, హిందీ భాష లో వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న ఈ భామ ప్రస్తుతం తిరిగి
కోలీవుడ్‌లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే తమిళ హీరో విజయ్ నటించిన మాస్టర్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మాస్టర్ చిత్రం తర్వాత విజయ్ తన తర్వాత ప్రాజెక్టును నెల్సన్ దిలీప్ కుమార్ తో చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అయితే విజయ్ హీరోగా ఇది 65 చిత్రం కాగా ఇందులో కథానాయికగా పూజాహెగ్డేను తీసుకోవాలని దర్శకుడు దిలీప్ కుమార్ భావించినట్లు తెలుస్తోంది. ఈ మేరకే దర్శకుడు పూజా హెగ్డే తో సంప్రదింపులు జరిపారని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో అరుణ్ విజయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారని సమాచారం.అయితే ఈ విషయాలన్నీ ఇంటి గురించి చిత్రబృందం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. తెలుగు లో పూజ హెగ్డే ప్రభాస్ సరసన “రాధేశ్యామ్” చిత్రం లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here