Prabhas: వామ్మో ప్రభాస్ కు పెద్దగా క్రేజ్ లేదని సినిమా నుంచి తప్పించిన స్టార్ డైరెక్టర్… ఇది టూ మచ్?

0
23

Prabhas: ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ఎంత సక్సెస్ అందుకున్నారో మనకు తెలిసిందే. ఇలా రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ప్రభాస్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఈయన స్టార్ హీరోగా ఇండస్ట్రీలో వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రభాస్ పట్ల ఒక డైరెక్టర్ చాలా అవమానకరంగా ప్రవర్తించారట సినిమాకు కమిట్ అయ్యి పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే సమయంలో ప్రభాస్ ను తప్పించి ఈ సినిమాలో మరొక స్టార్ హీరోని తీసుకున్నారని తెలుస్తోంది. మరి ఆ డైరెక్టర్ ఎవరు ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే..

డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ డైరెక్టర్ గా ఎలాంటి గుర్తింపు పొందారో మనకు తెలిసిందే. ఈయన దర్శకత్వంలో వెంకటేష్ ఆసిన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఘర్షణ. ఈ సినిమాకు ముందుగా ప్రభాస్ ఎంపిక అయ్యారని ప్రభాస్ హీరోగా పూజ కార్యక్రమాలు కూడా జరిగాయని తెలుస్తుంది. అయితే ప్రభాస్ కి అప్పుడు పెద్దగా క్రేజ్ లేకపోవడంతో గౌతమ్ వాసుదేవ మీనన్ ఈ సినిమా నుంచి ప్రభాస్ ను పక్కకు తప్పించి వెంకటేష్ ను తీసుకున్నారట.

Prabhas:ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభాస్…


ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అయితే ప్రభాస్ కి క్రేజ్ లేదని ఈ సినిమా నుంచి తప్పించిన డైరెక్టర్ వాసుదేవ మీనన్ ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమానికి అదే ప్రభాస్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం విశేషం.అయితే ప్రభాస్ ఏవి మనసులో పెట్టుకోకుండా ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో సందడి చేస్తూ చిత్రం బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.