Praveen: ఫైమాని మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న పటాస్ ప్రవీణ్… వైరల్ అవుతున్న ఫోటోలు!

0
32

Praveen: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కామెడీ షో లలో జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ గా ఇండస్ట్రీకి పరిచయం అవ్వడమే కాకుండా ఇండస్ట్రీలో మంచి స్థానంలో స్థిరపడ్డారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందినటువంటి వారిలో పటాస్ ప్రవీణ్ ఒకరు.

ప్రవీణ్ ఈ కార్యక్రమం మొదట్లో పలువురి టీమ్ లో కమెడియన్ గా నటిస్తూ సందడి చేసేవారు. అయితే ప్రస్తుతం ఈయన పటాస్ ప్రవీణ్ అనే టీంకు లీడర్ గా మారిపోయారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తూనే ఈయన ఫైమాతో ప్రేమలో పడిన విషయం మనకు తెలిసిందే. అయితే వీరిద్దరూ పర్ఫామెన్స్ చూస్తే నిజంగానే ప్రేమలో ఉన్నారని అనుమానం అందరికీ వస్తుంది కానీ ఎప్పుడు కూడా వీరి ప్రేమ పెళ్లి గురించి సీరియస్ గా ప్రకటించిన దాఖలాలు లేవు.

తాజాగా పటాస్ ప్రవీణ్ ఫైమాని కాకుండా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఫైమా అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైమాని ప్రేమించానని చెబుతూనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ కామెంట్స్ చేశారు.

Praveen: స్టార్ మా కు దగ్గర అయిన ఫైమా…


ఈ వ్యాఖ్యలపై స్పందించిన ప్రవీణ్ ఇది నిజమైన పెళ్లి కాదని కొమరక్క యూట్యూబ్ ఛానల్ కోసం ఒక సరదా వీడియో చేశామని తెలిపారు. ఇలా సరదాగా చేసామని చెప్పడంతో ఓ కింత అభిమానులు శాంతించారు.మరి నిజంగానే ప్రవీణ్ ఫైమా ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా అనేది కాలమే నిర్ణయించాలి. ఎందుకంటే బిగ్ బాస్ అవకాశం వచ్చిన తర్వాత ఫైమా రేంజ్ భారీగా పెరిగిపోయింది. అంతేకాకుండా ఈమె ఈటీవీ కి కూడా దూరమై ప్రస్తుతం స్టార్ మా లో వరుస కార్యక్రమాలలో బిజీగా గడుపుతున్నారు.