తులసి చెట్టు కింద అది పెడితే లక్ష్మీదేవి కటాక్షమే!

0
597

మన భారతీయ సంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను దైవ సమానంగా భావిస్తాము. ఈ క్రమంలోనే తులసి మొక్కకు ప్రతిరోజు పూజలు చేస్తుంటారు. అయితే మనకు అష్టైశ్వర్యాలు కలిగి సకల సంపదలు కలగాలంటే, తులసి మొక్కకు పూజ చేసే సమయంలో తులసి చెట్టు కింద ఈ విధంగా చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

సాధారణంగా మన హిందువుల ఇళ్ళల్లో తులసి మొక్క లేని ఇల్లు ఉండదు. చిన్నదైనా పెద్దదైనా తులసికి ప్రత్యేకమైన కోటను ఏర్పాటు చేసి పూజలు చేస్తుంటారు. కేవలం పూజలో మాత్రమే కాకుండా ఆయుర్వేద పరంగా తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసి ఆకుల నుంచి కాండం వరకు ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. దైవ పరంగా చూస్తే కొంతమంది ఎన్ని డబ్బులు సంపాదించిన వారి చేతిలో డబ్బు నిలవదు. అటువంటి వారుతులసి కోటకు పూజ చేసే సమయంలో ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

పురాణాల ప్రకారం… శాలిగ్రామ రాయిని శనివారం సాయంత్రం వేళ తులసి మొక్క కింద ఉంచాలి. ఈ రాయిని సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపంగా భావిస్తారు. గండక్ శిలలను శాలిగ్రామ రాళ్లుగా భావిస్తారు. తిరుమలలో కొలువై ఉన్న శ్రీ హరి విగ్రహం కూడా గండక్
శిల అనే చెబుతారు. ఈ విధమైన శాలిగ్రామ రాయిని శనివారం తులసి కోట ముందు ఉంచి పూజ చేయటం వల్ల ఆ ఇంటిలోకి ధనలక్ష్మి ప్రవాహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

మన పేదరికాన్ని తొలగించడమే కాకుండా కుటుంబంలో మనశ్శాంతినీ కలుగజేస్తుంది.ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన దంపతులు ఈ విధంగా పూజ చేయటం వల్ల సంసారంలో సుఖసంతోషాలతో పాటు తొందరగా సంతాన భాగ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.