Sharwanand: శర్వానంద్ నిజంగానే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారా…. అసలు విషయం చెప్పిన శర్వానంద్ టీమ్!

0
30

Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హిట్టు ఫ్లాపాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన ఈ ఏడాది మొదట్లో రక్షిత రెడ్డి అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నారు. ఇలా వీరి నిశ్చితార్థం సినీ సెలబ్రిటీల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది.అయితే వీరి నిశ్చితార్థం జరిగి సుమారు ఐదు నెలలు అవుతున్న పెళ్లి గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

ఇలా శర్వానంద్ పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఎంతోమంది శర్వానంద్ పెళ్లి క్యాన్సిల్ చేసుకోబోతున్నారనీ పెద్ద ఎత్తున వార్తలను సృష్టించారు. ఇలా శర్వానంద్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో శర్వానంద్ ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా శర్వానంద్ టీం స్పందిస్తూ శర్వానంద్ పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు.

శర్వానంద్ రక్షిత ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారని అయితే ప్రస్తుతం శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా 40 రోజులపాటు లండన్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకొని తిరిగి ఇండియా వచ్చారని తెలియజేశారు. ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి అయిన తర్వాత శర్వానంద్ తన పెళ్లి గురించి అన్ని విషయాలు తెలియచేయనున్నారని శర్వా టీమ్ తెలియజేశారు.


Sharwanand:త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటిస్తాం..

ప్రస్తుతం శర్వానంద్ హైదరాబాద్ లోనే ఉన్నారని, పెళ్లి గురించి ఇరువురు కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడి త్వరలోనే పెళ్లి తేదీని కూడా ప్రకటించబోతున్నారని ఈ సందర్భంగా శర్వానంద్ రక్షితల పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందించిన శర్వానంద్ టీమ్ ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదంటూ ఖండించారు. ఇలా శర్వానంద్ పెళ్లి క్యాన్సిల్ కాలేదనే వార్త తెలియడంతో అభిమానుల సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.