ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో వేటిని నమ్మాలో వేటిని నమ్మకూడదో ఎవరికీ అర్థం కావడం లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఎవరైతే ఓటుహక్కును వినియోగించుకోరో వారి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కట్ అవుతాయని ఆ వార్త సారాంశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు, మీడియా ప్రతినిధులు ప్రజలను ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరుతున్న సంగతి తెలిసిందే.

ఈసీ సైతం ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగింకుకునేలా చర్యలు చేపడుతోంది. అయితే అధికారులు ఎంత ప్రయత్నించినా 100 శాతం పోలింగ్ మాత్రం ఎక్కడా నమోదు కావడం లేదు. ఇలాంటి తరుణంలో 2024 లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని.. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోని పక్షంలో అకౌంట్ నుంచి 350 రూపాయలు కట్ అవుతాయని ఆ వార్త సారాంశం.

ఎన్నికల కమిషన్ ఈ విధంగా చేయబోతుందని ఒక న్యూస్ వెబ్ సైట్ ప్రచురించించింది. అయితే పీఐబీ వైరల్ అవుతున్న వార్తలో ఎలాంటి నిజం లేదని చెబుతోంది. ఓటు హక్కు వినియోగించుకోని వారి బ్యాంక్ అకౌంట్ నుంచి 350 రూపాయల కట్ చేస్తారని వైరల్ అవుతున్న వార్త ఫేక్ న్యూస్ అని ఇలాంటి వార్తలను నమ్మవద్దని పీఐబీ సూచించింది. వైరల్ అవుతున్న వార్తను ఎవరూ నమ్మవద్దని కోరింది.

కొందరు కావాలనే ఇలాంటి ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు అమాయకులు సర్క్యులేట్ చేసే వార్తల వల్ల ఇతరులు సైతం ఆ వార్తలను నిజమని నమ్ముతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here