తెలంగాణా రాష్ట్రంలో సింగిల్ ధియేటర్ల ఓనర్లు మరియు నిర్మాతల మండలి మధ్య వవాదం కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో సింగిల్ స్క్రీన్లను నిలిపివేస్తామంటూ హెచ్చరిస్తున్నారు సింగల్ ధియేటర్ల ఓనర్లు. ఈ సమస్య పరిష్కారానికై పలు దఫాలుగా భేటీలు నిర్వహిస్తున్నారు.

రెంటల్ సిస్టం తొలగించాలని, మల్టిప్లెక్స్ లలాగా పర్సంటేజ్ విధానం కావాలని మరియు సినిమాలు వచ్చిన 6 వారల తరువాతే ఓటిటి లలో ఆ సినిమాను విడుదల చేయాలని మొదలగు డిమాండ్ల తో ధియేటర్ల ఓనర్లు పట్టుపడుతున్నారు. ఒకవేళ అలా చేయకపోతే మర్చి 1 వ తెదీ నుండి తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ ధియేటర్లు అన్ని మూసివేస్తామని అల్టిమేటం కూడా జారీ చేసారు. ఈ నేపధ్యంలో ఈరోజు భేటి జరిగింది అందులో ఎమి తేలకపోవడంతో మళ్ళి శనివారం మరోసారి భేటీ కానున్నట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here