Sowmya Rao: అలాంటి పరిస్థితి ఏ తల్లికీ రాకూడదు…ఎమోషనల్ అయిన యాంకర్ సౌమ్య రావు…?

0
32

Sowmya Rao: జబర్థస్త్ యాంకర్ సౌమ్య రావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . మొదట బుల్లితెర మీద ప్రసారమవుతున్న సీరియల్స్ నటించి ప్రేక్షకులకు దగ్గరైన సౌమ్య రావు అనూహ్యంగా జబర్థస్త్ యాంకర్ గా ఛాన్స్ కొట్టేసింది. జబర్థస్త్ షో లో వచ్చీ రాని తెలుగులో మాట్లాడుతూ అందరి మీద సెటైర్ లు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.

ఇదిలా ఉండగా ఇటీవల మాతృ దినోత్సవం సందర్భంగా సౌమ్యరావు తన తల్లిని దలుచుకుంటూ ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. మదర్స్ డే సందర్భంగా తన తల్లితో కలిసి ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది. సౌమ్య రావు తల్లి క్యాన్సర్ సమస్యతో బాధపడుతు మరణించింది. ఆమె ఆఖరి రోజుల్లో పడిన కష్టాలు తలుచుకుని భావోద్వేగానికి గురైంది సౌమ్య.

ఈ క్రమంలో చివరి రోజుల్లో తన తల్లి అనుభవించిన నరకయాతన గురించి వివరిస్తూ.. అలాంటి పరిస్థితి మరే తల్లికి రాకూడంటూ కన్నీటి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియోలో తన తల్లి గురించి మాట్లాడుతూ..” అమ్మంటే నాకు ఒక బాధాకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది అంటూ ఎమోషనల్ అయ్యింది. అమ్మ ఆరోగ్యంగా తిరిగి రావాలని నేను మొక్కని దేవుడు లేడు. వెళ్లని గుడి లేదు. అమ్మ ఆరోగ్యం కోసం ఎన్నో పూజలు చేశాను. ఉపవాసాలు ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది.

Sowmya Rao: క్యాన్సర్ తో మరణించిన తల్లి…


అయినా దేవుడు మా మీద దయ చూపించ లేదు. దేవుడు ఎందుకు నా పట్ల ఇంత నిర్దయగా ప్రవర్తించి అమ్మను నాకు దూరం చేసాడనీ బాధ పడని రోజు లేదు. . అందరూ అమ్మ ఫోటో షేర్ చేస్తూ మదర్స్ డే శుభాకాంక్షలు చెప్తుంటే, నాకు మాత్రం చివరి రోజుల్లో నువ్వు పడిన బాధే జ్ఞాపకం వస్తుంది’’ అంటూ ఎమోషనల్ అయ్యింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఎమోషనల్ అవుతూ సౌమ్యకి దైర్యం చెబుతున్నారు.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

 

 

A post shared by Sowmya Rao (@sowmya.sharada)