Connect with us

Movie News

ఈ సినిమా విలన్ ని ఆదుకునే హీరోనే లేడా.. విషమంగా ఆరోగ్యం..!!!

Published

on

హీరోల పరిస్థితి ఎలా ఉన్నా ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్ లు, నటీనటుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.. నిజానికి హీరోలకు ఎంతో కొంత బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది. డబ్బుకు కూడా కొదువ ఉండదు.. అందుకే వారు ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బంది ని అయినా పేస్ చేశారు. కానీ నటీనటులు, హీరోయిన్ ల పరిస్థితి ఆలా అందదు.. ఉన్నత సేపు వారికి క్రేజ్ ఉన్నా ఫేడ్ అవుట్ అయ్యాక వారిని పట్టించుకునే వారే ఉండరు. వారికేదైనా జబ్బులు వచ్చి రోడ్డున పడ్డా ఆదుకునే వారు ఉండరు.

ఇప్పటికే చాలామంది అలా అవడం మనం చూసాం.. ఆర్థిక సాయం కోసం చూసే హీరోయిన్లను , డబ్బులేక వైద్యం చేయించుకునే స్థోమత లేక చనిపోయిన నటులను ఎంతోమందిని చూశాం.. తాజాగా ఓ సినిమా విలన్ కూడా ఇప్పుడు అదే స్థితి ని ఎదుర్కొంటున్నాడు. ఆ సీనియర్ నటుడు మరెవరో కాదు. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న పొన్నాంబళం. ప్రస్తుతం ఈ నటుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అందుకే ఇటీవల ఆర్థిక సహాయాన్ని కోరుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు.

తమిళ్ లో దాదాపు స్టార్ హీరోలందరితో యాక్ట్ చేసిన పొన్నాంబళం రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వారితో మంచి సాన్నిహిత్యం ఉంది. 57ఏళ్ల ఈ నటుడు పాతికేళ్ల వయసు నుంచే సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. తన నటనతో విలన్ గా ఒకప్పుడు ఆడియెన్స్ ను బయపెట్టిన పొన్నాంబళం ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. అంతే కాకుండా గత కొంతకాలంగా కిడ్నీ సంబందిత వ్యాధితో బాధపడుతున్నాడు. హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న ఈ నటుడికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేస్తేనే బ్రతుకుతాడట. కిడ్నీ మార్పిడి చికిత్స కోసం భారీగా ఖర్చవుతుందని ఆర్థికంగా సహాయం చేస్తే బ్రతుకుతానని పొన్నాంబళం మీడియాకు తెలియజేశాడు.తన సోదరి కొడుకు కిడ్నీ దానం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతూ ఇప్పటికే అగ్ర హీరోలు నటులు సహాయం చేసినట్లు చెప్పారు. కమల్ హాసన్, రజనీకాంత్, రాధిక శరత్ కుమార్ సహాయం చేశారని చెబుతూ.. మరికొంత మంది దయతో సహాయం చేస్తే ప్రాణాలతో బయటపడతానని అలాగే తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ కు కూడా పొన్నాంబళం విజ్ఞప్తి చేశారు.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Puri Jagannadh: పూరి జగన్నాథ్ కు పోకిరి కంటే ఆ సినిమా డైలాగ్స్ అంటే అంత ఇష్టమా?

Published

on

Puri Jagannadh: పూరి జగన్నాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా ఈయన డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వాళ్ళే.

ఇక పూరి జగన్నాథ్ సినిమాలు చాలా భిన్నంగా ఉంటాయి ఈయన సినిమాలలో హీరోలకు ఇచ్చే ఎలివేషన్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈయన సినిమాలలో హీరోలు అందరూ కూడా కాస్త పొగరుగా ఉండేలాగే చూపిస్తూ ఉంటారు. ఇక ఈయన సినిమాలలో డైలాగ్స్ కూడా భారీ స్థాయిలో పేలుతూ ఉంటాయి. ఇక ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈయన డైరెక్షన్ చేసిన సినిమాలలో పోకిరి సినిమా మరో లెవల్ అని చెప్పాలి.

ఈ సినిమాలో మహేష్ బాబు నటన ఆయన చెప్పిన డైలాగ్స్ భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇలా ఇంత మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమాలోని డైలాగ్స్ అంటే తనకు పెద్దగా ఇష్టం లేదని పూరి ఓ సందర్భంలో వెల్లడించారు. తనకు పోకిరి సినిమా కంటే బిజినెస్ మాన్ సినిమాలో డైలాగ్స్ అంటే చాలా ఇష్టమని ఈయన తెలిపారు.

Advertisement

బిజినెస్ మాన్..
ఈ సినిమాలో నన్ను కన్ఫ్యూజ్ చేయకండి కన్ఫ్యూజన్లో ఎక్కువగా కొట్టేస్తా అని చెప్పే డైలాగ్స్, ముంబైకి ఉచ్చ పోయించడానికి వచ్చా అంటూ డైలాగ్స్ బారి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అయితే ఈ సినిమాలో డైలాగ్స్ అంటేనే తనకు ఇష్టం అంటూ పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక పూరి విషయానికొస్తే ప్రస్తుతం ఈయన డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Tollywood: గన్నవరం చేరుకున్న టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్.. పవన్ తో కీలక భేటీ?

Published

on

Tollywood: టాలీవుడ్ కి సంబంధించిన పలువురు స్టార్ సెలబ్రిటీలందరూ కూడా ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. వీరంతా నేడు క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి సినీ నటుడు పవన్ కళ్యాణ్ కలవబోతున్నట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో విజయవాడ క్యాంప్ ఆఫీసులో నిర్మాతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు.

ఈ విధంగా టాలీవుడ్ నిర్మాతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ని కలిసి సినిమా ఇండస్ట్రీలో ఎదురవుతున్న సమస్యలను వివరించబోతున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా ఏపీలో ప్రస్తుతం సినిమా టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి అలాగే స్పెషల్ షోస్ బెనిఫిట్ షోలకు కూడా పరిమితి లేదు. ఈ క్రమంలోనే ఈ అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

గత ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు భారీగా తగ్గించడమే కాకుండా బెనిఫిట్ షోలకు కూడా అనుమతి లేకుండా చేసింది. ఈ క్రమంలోనే ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చిత్రపరిశ్రమ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక నేడు చిత్ర పరిశ్రమపై ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసమే భేటీ కానున్నారని తెలుస్తోంది.

Advertisement

ఇండస్ట్రీ సమస్యలపై చర్చ..
ఇక ఈ భేటీలో భాగంగా ప్రముఖ నిర్మాతలైన దిల్ రాజు, అశ్వినీ దత్, అల్లు అరవింద్, నాగ వంశీ, యార్లగడ్డ సుప్రియ, టిజి విశ్వప్రసాద్, దగ్గుబాటి సురేష్ వంటి వారందరూ కూడా వెళ్లారని తెలుస్తోంది. మరొక మూడు రోజులలో అశ్వినీ దత్ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కల్కి సినిమా విడుదల కాబోతుంది అయితే ఈ సినిమా టికెట్ల రేట్లు పెంపు విషయంపై ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఈ భేటీ అనంతరం కల్కి సినిమా టికెట్ల విషయంలో కూడా క్లారిటీ రాబోతుందని తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Nagarjuna: కొంచమైనా మానవత్వం ఉందా.. ట్రోల్స్ కి గురైన నాగార్జున.. క్షమాపణలు చెప్పిన హీరో!

Published

on

Nagarjuna: సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక నాగార్జున తన సినిమాల వరకు తాను బిజీగా ఉంటారు తప్ప ఇతర విషయాల గురించి పెద్దగా కల్పించుకోరు. అంతేకాకుండా ఈయన సోషల్ మీడియాకి కూడా చాలా దూరంగా ఉంటారు.

ఇలా సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండే ఈయన అత్యవసరమైతే తప్ప ఆయా సంఘటనలపై స్పందించరు. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా నాగార్జున భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఇలా ట్రోల్స్ కి గురి కావడంతో వెంటనే నాగార్జున క్షమాపణలు చెబుతూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

అసలు నాగార్జున క్షమాపణలు చెప్పడం ఏంటి? ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. నాగార్జున ఇటీవల ఎయిర్ పోర్ట్ లో కనిపించారు సాధారణంగా సెలబ్రిటీలు ఎవరైనా కనిపిస్తే అభిమానులు వారితో సెల్ఫీ తీసుకోవడం కోసం వెళ్తారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని సెల్ఫీ తీసుకోవడం కోసం వెళ్లగా అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆయనని తోసేసారు దీంతో ఆ అభిమాని ఒక్కసారిగా కింద పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

ఇకపై జరగవు.
ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ నాగార్జున పై ట్రోల్ చేశారు. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో నాగార్జున స్పందించి క్లారిటీ ఇచ్చారు.. ఈ విషయం ఇప్పుడే నా దృష్టికి వచ్చింది అలా ఒక వ్యక్తిని తోయటం సరైంది కాదు ఆ వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నాను ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాము అంటూ నాగార్జున ఈ సందర్భంగా క్షమాపణలు చెబుతూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!