Tarakaratna: హాస్పిటల్ బెడ్ పై తారకరత్న…. వైరల్ అవుతున్న ఫోటో!

0
387

Tarakaratna: నందమూరి తారకరత్న ఆరోగ్య విషయంపై ప్రతి ఒక్కరు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈయన యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ కు మద్దతు తెలపడం కోసం కుప్పం వచ్చారు. అయితే పాదయాత్రలో భాగంగా తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆయనను ప్రాథమిక చికిత్స నిమిత్తం దగ్గర్లోనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనకు గుండెపోటు వచ్చిందని తెలియగానే వైద్యులు మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు.

ప్రస్తుతం తారకరత్న బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.ప్రత్యేక వైద్య నిపుణుల సమక్షంలో ఈయనకు చికిత్స జరుగుతుంది. అయితే ఎప్పటికప్పుడు వైద్యులు తారకరత్న ఆరోగ్య విషయం గురించి వెల్లడిస్తున్నారు.ప్రస్తుతం ఈయన వెంటిలేటర్ పైనే ఉన్నారని అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగవుతుందని వైద్యులు ప్రకటించారు.

ఇలా తారకరత్న ఆరోగ్యం కుదుటపడటంతో అభిమానులు సినీ సెలెబ్రిటీలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో ఇప్పటికే నందమూరి నారా కుటుంబ సభ్యులందరూ కూడా నారాయణ హృదయాలయకు చేరుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పటివరకు హాస్పిటల్లో తారకరత్న ఉన్నప్పటికీ ఆయనని చూడటం కోసం ఎవరిని అనుమతించలేదని తెలుస్తుంది.

Tarakaratna: కోలుకుంటున్న తారకరత్న


తాజాగా ఆసుపత్రి బెడ్ పై తారకరత్న ఉన్నటువంటి ఫోటో లీక్ అవ్వడంతో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో తారకరత్నకు ఆక్సిజన్ సహాయంతోనే శ్వాస అందిస్తున్నారని తెలుస్తుంది.అయితే ఇలా మొదటిసారి తారకరత్న ఫోటో వైరల్ కావడంతో అభిమానులు కూడా కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని వైద్యులు కూడా ప్రకటించడంతో మరే ప్రమాదం లేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక తారకరత్న విషయంలో మెగాస్టార్ స్పందిస్తూ ఆయన కోరుకుంటున్నారనే విషయం తనకు ఎంతో ఉపశమనాన్ని కలిగించిందని ట్వీట్ చేశారు.