Tarakaratna: తారకరత్న మరణించి 100 రోజులు… వైరల్ అవుతున్న అలేఖ్య రెడ్డి పోస్ట్..?

0
47

Tarakaratna: నందమూరి వారసుడు నందమూరి తారక రత్న మూడు నెలల క్రితం మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటు రావటం వల్ల 23 రోజులు పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తారకరత్న మరణం నందమూరి కుటుంబంతో పాటు సినిమా ఇండస్ట్రీలో కూడా తీవ్ర విషాదాన్ని మిగిలింది. ముఖ్యంగా తారకరత్న మరణాన్ని ఆయన భార్య అలేఖ్యరెడ్డి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది.

తారకరత్న ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అలేఖ్య రెడ్డి ఇలా అనూహ్య పరిణామాల వల్ల తారకరత్న మరణించిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటికి తారకరత్నని తలుచుకుంటూ సోషల్ మీడియాలో తరచూ ఎమోషనల్ పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా అలేఖ్య రెడ్డి షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తారకరత్న మరణించి 100 రోజుల సందర్భంగా భర్తని తలుచుకుంటూ అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

ఈ క్రమంలో వేర్వేరు టాటూలకు సంబంధించిన ఫోటోలను అలేఖ్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా తారకరత్నని తలచుకుంటూ తన ” ఈ మధ్య కాలంలో నా జీవితంలో జరిగిన ఏ ఘటనకు కూడా నేను ప్రిపేర్ గా లేనని ఆమె తెలిపింది.
తారకరత్న మరణం మరచిపోలేకపోకపోతున్నాను. తారకరత్న మరణం వల్ల తన హృదయం ఇప్పటికీ దుఃఖిస్తోందని తెలిపింది .

Tarakaratna: బాధలకు అలవాటు పడ్డాను…


నువ్వు మరణించావని, ఇక జీవితంలో తిరిగి రావని నాకు తెలుసు. నా జీవితంలో వచ్చినా తేడా ఏంటంటే.. నేను ఇప్పుడు బాధకు బాగా అలవాటు పడ్డాను అంటూ అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. నువ్వూ మమ్మల్ని వదిలేసి వెళ్ళినా మా హృదయాలను మాత్రం వదిలి వెళ్ళలేవు అంటూ కన్నీరు పెట్టుకుంది. అలేఖ్య రెడ్డి షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.