AP Politics: మరొక రెండు వారాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు పెద్దగా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున పార్టీ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షనేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో దూకుడు కనబరుస్తున్నారు.

ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత తన మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా మొదటి సంతకం డీఎస్సీ పై పెడతానని చెప్పిన బాబు రెండో సంతకం కూడా దీనిపై పెట్టబోతున్నారనే విషయాన్ని తెలిపారు.
కూటమి గెలిస్తే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ రద్దు పైనే సంతకం చేస్తానని తెలిపారు. అసలు ఏపీలో ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలులోనే లేదు కానీ తమ ప్రచార కార్యక్రమాల కోసం లేనది ఉన్నట్టు క్రియేట్ చేస్తూ బాబు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఇప్పటికే వైసీపీ నేతలు అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మండిపడ్డారు.
ల్యాండ్ టైటలింగ్ యాక్ట్..
ఇలాంటి టైటిలింగ్ చట్టం ద్వారా మన భూముల ఒరిజినల్ పట్టాలు ప్రభుత్వంలో తీసుకొని కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే మనకిస్తోందని ఈ విషయంపై న్యాయ పోరాటంలో పోరాటం చేసే అవకాశాలు కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశారు అంటూ చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారాలకు తెర తీశారు. ఇలా లేని చట్టాన్ని ఉందని చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అంతే కాకుండా వారిని నమ్మించడం కోసం తన రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు పై అంటూ చంద్రబాబు బహిరంగంగా అసత్యాలు చెప్పడం అందరిని విస్మయానికి గురి చేస్తుందని చెప్పాలి.





























