ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 368 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థుల నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దరఖాస్తులను కోరుతోంది. మొత్తం 368 ఉద్యోగాలలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) ఉద్యోగాలు 264 ఉండగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్) 83 ఉన్నాయి.

మేనేజర్ (ఫైర్ సర్వీసెస్) ఉద్యోగాలు 11, మేనేజర్ (టెక్నికల్) ఉద్యోగాలు 2, జూనియర్ ఎగ్జిక్యూటివ్(టెక్నికల్) ఉద్యోగాలు 8 ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ/బీటెక్‌తో పాటు 5 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు మేనేజర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌, ఫైర్ ఇంజనీరింగ్ చదివిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.

ఫిజిక్స్, మ్యాథమాటిక్స్‌ లో బీఎస్సీ చదివిన వాళ్లు లేదా ఇంజనీరింగ్ కోర్సులలో ఫిజిక్స్, మ్యాథమాటిక్స్ సబ్జెక్టులు ఉన్నవాళ్లు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అనుభవం లేకపోయినా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి.

జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా ఉండగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 170 రూపాయలుగా ఉంది. డిసెంబర్ 15, 2020లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి 14, 2021 దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది. www.aai.aero వెబ్ సైట్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here