Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే నటి సమంత సైతం ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా విజయ్ దేవరకొండ ఫోటోని షేర్ చేస్తూ తనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

సమంత విజయ్ దేవరకొండ ఇదివరకు మహానటి సినిమాలో కలిసిన నటించిన విషయం మనకు తెలిసిందే
అయితే తాజాగా వీరిద్దరూ కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.
ఈ విధంగా సమంత విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇకపోతే నేడు సమంత కోస్టార్ విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ….నా మంచి స్నేహితుడు, నా ఫేవరేజ్ కోస్టార్ విజయ్ దేవరకొండ బర్త్ డే సీడీపీని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది.

Vijay Devarakonda: నీ సక్సెస్ కోసం ప్రార్థిస్తున్నా….
నీ సక్సెస్ కోసం నేను ప్రార్థిస్తున్నా, విషెస్ తెలియజేస్తున్నా ఎందుకంటే నువ్వు నిజంగా అన్నింటిలో బెస్ట్ పొందేందుకు అర్హత కలిగి ఉన్నావు అంటూ సోషల్ మీడియా వేదికగా తనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో ఖుషి సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.