Vijay Varma:టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్న ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో మునిగితేలుతున్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సిరీస్లో నటిస్తున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇలా ప్రేమలో పడటంతోనే ఇద్దరు కూడా రొమాంటిక్ సన్నివేశాలలో నటించే సందడి చేశారు.

ఇక ఈ సిరీస్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడటం వీరి ప్రేమ విషయాన్ని బహిరంగంగా అందరికీ తెలియజేయడం జరిగింది.ఇలా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నటువంటి ఈ జంట గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. తాజాగా విజయ్ వర్మ తమన్నాతో ప్రేమ గురించి పలు విషయాలను తెలియజేశారు.
తాను తమన్నతో ప్రేమలో ఉన్న తర్వాత అందరిలాగే మా జంటకు కూడా ఇంత పాపులారిటీ ఉందని తాను అసలు అనుకోలేదని తెలిపారు. ఇలా ప్రేక్షకాదరణ మాపై ఉండడం నిజంగా సంతోషించదగ్గ విషయమని ఈయన తెలియజేశారు. ఇకపోతే తామిద్దరం ప్రేమలో ఉన్నప్పుడు బయటకు వెళ్ళగా అందరి దృష్టి మాపైనే పడేదని తెలిపారు.

Vijay Varma: అలవాటు పడుతున్నాను…
ఇలా నేను తమన్నా బయటకు వెళ్లిన ప్రతిసారి మమ్మల్ని పాయింట్ అవుట్ చేసేవారు. ఆ సమయంలో తనకు చాలా అసౌకర్యంగా అనిపించేదని ఈయన తెలియజేశారు.అయితే తాను కూడా ఇలాంటి వాటిని అలవాటు పడుతున్నాను అంటూ విజయ్ వర్మ ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.