‘షుగర్ డిటాక్స్‌’తో.. ఎన్నో వ్యాధులు మాయం!

0
271

చక్కెరను అవరసం అయిన దాని కంటే ఎక్కువగా తీసుకుంటే ఎన్నో అనర్థాలు వస్తాయి. అయితే శరీరంలోని చక్కెరను తొలగించడానికి అనేక పద్దతులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా షుగర్ డిటాక్స్. ఈ షుగర్ డిటాక్స్ వల్ల ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు. ఈ పద్ధతిని పాటిస్తే శరీరంలో పేర్కొని ఉన్న షుగర్ ను తగ్గిస్తుంది.

తీపి పదార్థాలు తినాలనే కోరికలను అణచివేసేందుకు.. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు కనీసం వారం నుంచి ఒక నెల పాటు చక్కెర పదార్థాలను తినకుండా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. షుగర్ డిటాక్స్ ఎలా చేయాలంటే.. తినే ఆహారంలో చక్కెర పదర్దాలు లేకుండా చూసుకోవాలి.

స్వీట్లకు, కేక్ లకు దూరంగా ఉండాలి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు చక్కెర స్థాయిలు పెరిగితే వస్తాయి. షుగర్ డిటాక్స్ కనీసం ఒకటి నుంచి రెండు వారాల వరకు ప్రయత్నించాలి. షుగర్ డిటాక్స్ పూర్తయిన తరువాత.. తినే ఆహారంలో సహజ చక్కెర అంటే పండ్లు, కూరగాయలను స్వల్ప మొత్తంలో తీసుకుంటుండాలి. షుగర్ ను నియంత్రించడమే షుగర్ డిటాక్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, ఫైబర్ ఉండే ఆహారాలు తీసుకోవాలి.

షుగర్ పదర్థాలు తినడం ఒక్కసారే మానేయకుండా.. ప్రతీ రోజు నెమ్మదిగా మొదలుపెట్టండి. రోజు తీసుకునే చెక్కర పదార్థాల స్థాయిని క్రమంగా తగ్గించండి. డీహైడ్రేషన్ చక్కెర కోరికలను తీవ్రతరం చేస్తుంది. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు త్రాగేలా చూసుకోండి. సహజ చక్కెరలు ఉన్న పండ్లను తీసుకుంటే చాలా మంచింది.