చిరంజీవి గారింట్లో పెళ్లికి వెళ్తే… నాకు అలాంటి అనుభవం ఎదురయింది: డైరెక్టర్ వి.యన్. ఆదిత్య

0
921

తనది చాలా గ్లోరియస్ కెరీర్ అని గర్వంగా చెప్పుకున్నారు డైరక్టర్ వి.యన్. ఆదిత్య. తాను ఎవరి సినిమాలైతే చూసి పెరిగామో వాళ్లతోనే, అగ్ర హీరోలతోనే కలిసి పనిచేశానని ఆయన చెప్పుకొచ్చారు. అందులో ముఖ్యంగా రజనీ కాంత్, కమల్‌ హాసన్, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున లాంటి టాప్ హీరోలతో కలిసి పని చేయడం వల్ల వాళ్లతో పర్సనల్‌ రాపో ఏర్పడిందని ఆయన చెప్పారు. తనకు దక్కిన మరో గౌరవం, అదృష్టం ఏంటంటే కమలాకర్ కామేశ్వర్ గారితో కలిసి ఆ జనరేషన్‌లో ఎవరూ పనిచేయలేదని ఆయన చెప్పారు.

ఇకపోతే పి. సాంబశివరావని ఒక సూపర్ డైరెక్టర్ ఉండేవారని, ఆయనతో కలిసి పరోపకారి పాపన్న అని చందమామ కథలు తీశామని ఆదిత్య తెలిపారు. ఆయనకు తానొక్కడే కో-డైరెక్టర్ అన్న ఆయన, ఎంత అంటే తాను డైరెక్టర్ అయ్యాక హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో కనబడితే పరిగెత్తుకొని వెళ్లి, గురువు గారు నమస్తే, నన్ను గుర్తు పట్టారా ? మీ పరోపకారి సినిమాకు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశానని అన్నానని ఆయన చెప్పారట. దానికి ఆయన ఆదిత్య అని ఓ కుర్రాడు అతను. నువ్వు కాదు. అని ఆయన అన్నట్టు ఆదిత్య తెలిపారు. తన శరీర ఆకృతి మారడం వల్ల ఆయన తనను గుర్తు పట్టలేదని గ్రహించి, ఆ ఆదిత్య నేనే.. చాలా థ్యాంక్స్ ఇంకా నన్ను గుర్తు పెట్టుకున్నందుకు అని ఆన్నట్టు ఆయన తెలిపారు.

మరోసారి చిరంజీవి గారింట్లో పెళ్లికి వెళ్లినపుడు ఎవరో చెప్పారు.. మీ ఉలైపల్లి సినిమాలో లాస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అని. ఆయన గట్టిగా హగ్ చేసుకొని చాలా సేపటివరకు తనను వదలలేదని ఆయన చెప్పారు. ఆ వెడ్డింగ్ భోజనాల దగ్గర తనను అలా పొగడడం నిజంగా తనకు చాలా సంతోషం కలిగించిందని ఆదిత్య అన్నారు. ఇలాంటి ఎన్నో బెస్ట్ మూమెంట్స్ తన లైఫ్‌లో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.