సాఫ్ట్ వేర్ ఉద్యోగికి నగ్న వీడియోలు చూపించి లక్షలు కొట్టేసింది !! అంతటితో ఆగకుండా…

0
681

ఇంస్టాగ్రామ్ లో పరిచయమై తన అందచందాలు చూపించి ఏకంగా రూ. 3.63 లక్షలు కొట్టేసింది. అంతటితో ఆగకుండా ఆ యువతి మరో పది లక్షలు కావాలంటూ బెదిరించింది. ఆ యువతి బెదిరింపులు తట్టుకోలేక ఆ ఉద్యోగి సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసాడు. హైదరాబాద్ లో జరిగింది ఈ ఘటన. వివరాల్లోకి వెళితే..

ఒక యువకుడు హైదరాబాద్ నగరంలో ఐటి కారిడార్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొద్దిరోజల క్రితం ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక యువతి పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త ఫోన్ లో ఫోటోలు షేర్ చేసుకునే వరకు వచ్చింది. ఈ క్రమంలో ఒకరోజు ఆ యువతి తన నగ్న వీడియోను పంపించి అతనిని కూడా పంపాలని అడిగింది. అడిగిందే తరువుగా తన నగ్న వీడియోను ఆయువతికి పంపించాడు.

ఇక అప్పటి నుంచి ఆ యువతి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. అతని నగ్న వీడియోను అతడి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు అతడు పనిచేస్తున్న సహోద్యోగులకు పంపిస్తానని బెదిరించడం మొదలు పెట్టింది. అలా బెదిరిస్తూ ఒక్క వారంలో రూ. 3.63 లక్షలను తన బ్యాంకు అకౌంట్ కు బదిలీ చేయించుకుంది. అక్కడితో వదలకుండా మరో పదిలక్షలు కావాలంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. దీనితో ఆమె వేధింపులు తట్టుకోలేక ఆ ఉద్యోగి పోలీసులను ఆశ్రమించాడు. అతడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.