యోగా చేసిన తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి.. వేటికి దూరంగా ఉండాలి..?

0
264

యోగం అనగా శరీరం మరియు మనస్సుల కలయిక. ఈ రెండూ కలిసినప్పుడు చేసే యోగ సాధన మాత్రమే ప్రయోజనాన్ని ఇస్తుంది. ప్రతిరోజూ యోగాసనాలు వేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. యోగా అనేది మనస్సు, శరీరం రెండింటినీ ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఎంతగానో సహాయపడుతుంది. యోగాతో పాటు ఆరోగ్యానికి పరిపడా సమతుల్య ఆహారం తీసుకుంటే ఎంతో మేలు.

శక్తిని పెంచడానికి మనకు సమతుల్య ఆహారం అనేది ఎంతో అవసరం. అందువల్ల యోగా సాధన చేసిన తర్వాత ఆహారంలో తగినంత ఫ్యాట్, ప్రోటీన్, పిండి పదార్థాలు ఉన్నటువంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. యోగా చేసిన తర్వాత చాలామందికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో తెలియదు. ఇప్పడు వాటి గురించి తెలుసుకుందాం.

చికెన్ ఉడకబెట్టిన సూప్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. మీరు తీసుకునే సూప్‌లో క్యారెట్లు, సెలెరీ, పాలకూర లేదా క్యాబేజీతో కూడా తయారు చేయవచ్చు. పండ్లు లేదా కూరగాయల సలాడ్ కూడా తీసుకోచ్చు. వేయించిన గుడ్లతో రొట్టెని కూడా తినవచ్చు. ఇందులో ఆరోగ్యకరమైన ఫ్యాట్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పనీర్ తీసుకోవడం కూడా చాలా మంచిది. కొబ్బరి నీరు ఎలాంటి వారైనా తీసుకుంటారు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

వాటితో మనం పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చును. ఎల్లప్పుడూ హైడ్రేడ్ గా ఉంచుకోవాలంటే కొబ్బరి నీరు తీసుకోవాలి. యోగాసనం చేసిన తర్వాత మాంసం అస్సలు ముట్టుకోవద్దు. జంక్ ఫుడ్ ఐటెమ్స్ కు దూరంగా ఉంటే చాలా ఉపయోగకరం. చేసిన యోగాకు ఫలితం ఉండాలంటే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.