Actor Mohan Babu: సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు మోహన్ బాబు ఒకరు.ఇలా ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలను అనుభవించి ఎన్నో అవమానాలను ఎదుర్కొని తనకంటూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి మోహన్ బాబు నేడు (మార్చి 19) తన 71వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.

ఇలా తన పుట్టినరోజు సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మోహన్ బాబు ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న అవమానాలు కష్టాల గురించి చెబుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత విలక్షణ నటుడిగా నటించాను. అనంతరం హీరోగా స్థిరపడ్డాను. ఇక సినిమాలపై ఉన్న మక్కువతో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించి సినిమాలో కూడా నిర్మించానని తెలిపారు.
ఇలా సినిమాలు నిర్మిస్తున్న సమయంలో తన ఆస్తులు అన్నింటిని కూడా కోల్పోయానని ఎన్నో కష్టాలను అనుభవించానని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. నేను పైకి మీరు చూడటానికి బాగానే కనిపించవచ్చు కానీ సినిమాలలో కొనసాగుతూ చివరికి నేను ఉన్నటువంటి ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇలా కష్ట సమయాలలో ఉన్నప్పుడు తనని ఎవరు ఆదుకోలేదని ఈయన గుర్తు చేసుకున్నారు.

Actor Mohan Babu: ఇల్లు కూడా అమ్ముకున్నా…
ఇలా ఇండస్ట్రీలో తాను ఎన్నో కష్టాలను అనుభవించి నేడు ఈ స్థాయిలో ఉన్నానని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. అయితే అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది నేను పడినటువంటి కష్టాలు నా పగవాడికి కూడా రాకూడదని నేను కోరుకుంటాను అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈయన సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న నిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి అగ్ని నక్షత్రం సినిమాలో ఓ పాత్రలో నటిస్తున్నారు. అలాగే సమంత నటించిన శాకుంతలం సినిమాలో కూడా మోహన్ బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు.