Amitabh Bachchan: బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ గురించి ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అమితాబచ్చన్ ట్రాఫిక్ నియమాలకు విరుద్ధంగా హెల్మెట్ ధరించకుండానే ద్విచక్ర వాహనం మీద ప్రయాణించటంతో కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ముంబై రోడ్డు మీద ఒక అపరిచిత వ్యక్తి ద్విచక్ర వాహనం మీద అమితాబ్ బచ్చన్ దర్శనం ఇచ్చాడు.

తాజాగా ఈ ఫోటోలను అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సమయానికి షూటింగ్ కి చేరుకునేలా సాయం చేసిన వ్యక్తికి ధన్యవాదాలు తెలియజేశాడు. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..అమితాబ్ ప్రయాణంపై మాత్రం కొంత మంది నెటిజన్లు మండిపడ్డారు. ఈ క్రమంలో ముంబై పోలీసులకు ట్యాగ్ చేస్తూ.. సెలబ్రిటీ అయ్యిండి ఇలా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్త ఎలా అని కామెంట్టు పెట్టారు.
దాంతో ముంబయ్ పోలీసులు ఈ విషయం పై స్పందిస్తూ… తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు. దీంతో ప్రస్తుతం అమితాబచ్చన్ హెల్మెట్ ధరించకుండ ప్రయాణం చేయడంతో ఇది సోషల్ మీడియాలో వివాదంగా మారింది. ఇక తాజాగా ఈ వివాదంపై అమితాబచ్చన్ స్పందిస్తూ అలా హెల్మెట్ లేకుండా ప్రయాణించడానికి గల కారణం గురించి వివరించాడు.
ఈ మేరకు..” షూటింగ్‌కు లేటవుతుందనే కారణంతో అపరిచితుడి బైక్‌పై ప్రయాణం చేశానని తెలిపారు.

Amitabh Bachchan: అది ప్రధాన రహదారి కాదు…
ఆదివారం కాబట్టి రోడ్డుపై రద్దీ ఉండదని ముంబైలోని బల్లార్డ్ వీధిలో సినిమా షూటింగ్ ఏర్పాట్లు చేశారని, అక్కడికి కొద్ది దూరంలోనే కారు ట్రాఫిక్‌లో చిక్కుకోవటంతో ఒక వ్యక్తి బైక్ పై దగ్గరలో ఉన్న లొకేషన్ కి వెళ్లానని తెలిపాడు. లోకేషన్ కి చేరుకోవడానికి ఒక వీధిలో నుంచి మరో వీధిలోకి మాత్రమే బైక్‌పై ప్రయాణించానని, నడుస్తూ వెళ్తే సెక్యూరిటీ సమస్య వస్తుందని భావించి ఒక వ్యక్తి సహాయంతో బైక్ మీద హెల్మెట్ లేకుండా ప్రయాణం చేశానని బిగ్ బి వివరణ ఇచ్చారు .