Pitapuram: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఈసారి ఎన్నికల బరిలో దిగబోతున్న సంగతి మనకు తెలిసిందే. గత ఎన్నికలలో ఈయన భీమవరం గాజువాక నియోజకవర్గాలలో పోటీ చేసి ఓటమిపాలు అయ్యారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ కాపులు అధికంగా ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలి అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఈయన ఈసారి ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ కోసం మద్దతు తెలుపుతూ ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు కూడా పిఠాపురం చేరుకున్నారు.
ఇప్పటికే జబర్దస్త్ టీం మొత్తం పిఠాపురంలో పర్యటించి పవన్ కళ్యాణ్ గెలుపుకు దోహదపడుతున్నారు. అదేవిధంగా మరోవైపు నాగబాబు కుటుంబ సభ్యులు మొత్తం పిఠాపురంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పర్యటించిన సంగతి తెలిసిందే. వీరు మాత్రమే కాకుండా సీరియల్ ఆర్టిస్టులు కూడా పిఠాపురంలో పర్యటించారు.
పిఠాపురంలో వైష్ణవ్ తేజ్
ఇలా ఇప్పటికే భారీ మొత్తంలో సెలబ్రిటీలు పిఠాపురంలో పర్యటనలు చేశారు. అయితే తాజాగా మరొక మెగా హీరో కూడా పిఠాపురంలో పర్యటన చేయడం గమనార్హం. మెగా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి నటుడు వైష్ణవ్ తేజ్ జనసేన పార్టీ తరపున పిఠాపురంలో పర్యటించారు. తన మామయ్య పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలంటూ ఈయన కోరారు.





























