డిగ్రీ లేకుండా లక్షల్లో సంపాదిస్తున్న గుజరాత్ మహిళ.. ఎలా అంటే..?

0
118

భారతదేశంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా, లాక్ డౌన్ వల్ల గతంతో పోలిస్తే నిరుద్యోగుల శాతం భారీగా పెరిగినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. చాలామంది నిరుద్యోగులకు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉన్నా బిజినెస్ లో సక్సెస్ అవుతామో లేదో అనే సందేహం వల్ల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపలేకపోతున్నారు. కరోనా సమయంలో బిజినెస్ పెట్టినా లాభాలు రావని భావిస్తున్నారు.

అయితే గుజరాత్ కు చెందిన ఒక మహిళ మాత్రం డిగ్రీ లేకపోయినా నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తోంది. చాలామంది గొప్పగొప్ప చదువులు చదివితే మాత్రమే వ్యాపారంలో రాణించగలమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. అయితే ఆ మహిళ మాత్రం చదువు లేకున్నా నెలకు దాదాపు రూ. 9 లక్షలు సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సంవత్సరానికి కోటి రూపాయలకు పైగా సంపాదిస్తున్న ఆ మహిళ చేస్తున్న వ్యాపారం పాల వ్యాపారం కావడం గమనార్హం.

లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్న మహిళ పేరు నవాల్‌ బెన్ చౌదరీ. 190 పశువులతో రోజుకు 750 లీటర్ల పాలను విక్రయిస్తూ పదిమంది పనివాళ్లకు పదివేల రూపాయల చొప్పున వేతనం చెల్లిస్తూ వార్తల్లో నిలిచింది నవాల్ బెన్. పశువులలో 150 గేదెలు కాగా మిగిలినవి ఆవులు. డెయిరీ బిజినెస్ తో లక్షల్లో ఆదాయం సాధించవచ్చని నవాల్ బెన్ ప్రూవ్ చేస్తున్నారు. యువతకు ఆదర్శంగా నిలుస్తూ మంచిపేరు సంపాదించుకుంటున్నారు.

డెయిరీ బిజినెస్ ద్వారా నవాల్ బెన్ ఊహకు అందని ఆదాయాన్ని సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. గుజారత్ లోని బనస్కాంత జిల్లా వద్గమ్ తాలూకా నాగన గ్రామానికి చెందిన నవాల్ బెన్ సంవత్సరానికి కోటి రూపాయలకు పైగా ఆదాయం సంపాదిస్తున్న తీరును చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here