మెడలో గోల్డ్ చైన్ తో పరారైన యువకుడు… డోర్ లాక్ అవడంతో అలా?

0
153

సాధారణంగా బంగారు దుకాణాల్లో దొంగతనం చేయడం సర్వసాధారణమే. అయితే బంగారు దుకాణాల్లో దొంగతనాలు ప్లాన్ చేసే వారు రాత్రిపూట ఎవరు లేని సమయంలో దుకాణానికి కన్నం వేసి తీసుకువెళ్తారు. కానీ ఓ యువకుడు మాత్రం పట్టపగలే బంగారు దుకాణంలోకి వెళ్లి నగలను కొనుగోలు చేయడానికి వెళ్లి దుకాణంలో చైన్ దొంగలించి వెళ్తూ పట్టుబడిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

2018 లో జరిగిన ఈ సంఘటన మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ యువకుడు బంగారం కొనాలని దుకాణంలోకి వెళతాడు. అయితే అక్కడే ఒక చైన్ తీసుకుని దాని మెడలో వేసుకొని చూస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే యజమాని ఏదో పనిలో బిజీగా ఉండడంతో అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే హడావిడిగా డోర్ వద్దకు వెళ్లగా ఎంతసేపటికి తెరుచుకోకపోవడంతో ఆ యువకుడు చేసేదేమీ లేక తిరిగి యజమాని వద్దకు వచ్చి తాను దొంగిలించిన చైన్ అక్కడ పెట్టాడు.

ఈ క్రమంలోనే యజమాని పోలీసులకు ఫోన్ చేసి అతనిని అప్పగించాడు. అయితే ఆ బంగారు దుకాణం తలుపులు రిమోట్ కంట్రోల్ లో ఉంటాయనే విషయం తెలియక యువకుడు ఇంత సాహసానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలోనే పోలీసుల విచారణలో భాగంగా తన జాబ్ పోవడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్లే ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here