సునీల్ భార్యను మీరు ఎప్పుడైనా చూశారా.. ఆయన ఫ్యామిలీ ఎంత అందంగా ఉందో తెలుసా?

0
100693

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్ లలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సునీల్ ఒకరు.సినిమా ఇండస్ట్రీలో సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన కామెడీ టైమింగ్ లో పంచులు వేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న సునీల్ ఇండస్ట్రీలోకి రావడంతోనే ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ గుర్తింపును సంపాదించుకున్నారు.

సునీల్ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో కమెడియన్ గా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ తరువాత నువ్వేకావాలి చిత్రం ద్వారా కమెడియన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సునీల్ మొట్టమొదటి సినిమాతోనే ఎంతో ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలోనే మనసంతా నువ్వే, నువ్వు నేను చిత్రాల ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ఈ విధంగా ఏడాదికి సుమారు 20 చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంతో సందడి చేసిన సునీల్ వ్యక్తిగత విషయాల గురించి చాలా మందికి తెలియదు.

సునీల్ తన కుటుంబాన్ని ఎప్పుడూ కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. వారికి సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకోలేదు.సునీల్ వ్యక్తిగత విషయానికి వస్తే తన ఐదు సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు.తల్లి సంరక్షణలోనే పెరిగిన సునీల్ కు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి స్నేహితులు కావడంతో అతని ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.

అదేవిధంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది రోజులకే సునీల్ వివాహం జరిగింది. తమ బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్న సునీల్ భార్య పేరు శృతి. పెళ్లయినప్పటి నుంచి ఇప్పటివరకు సునీల్ తన భార్య ఫోటోలను ఎప్పుడు కూడా అభిమానులతో పంచుకోలేదు. ప్రస్తుతం సునీల్ కు ఒక పాప, బాబు కూడా ఉన్నాడు.

ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది రోజుల వరకు కమెడియన్ గా పని చేసిన సునీల్ ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “మర్యాద రామన్న” సినిమాలో హీరోగా నటించారు. హీరోగా పలు సినిమాల్లో నటించినప్పటికీ తిరిగి కమెడియన్ గా కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం సునీల్ పలు చిత్రాల్లో నటిస్తూనే,హరీష్ శంకర్ రాసిన వేదంతా రాఘవయ్య సినిమా ద్వారా హీరోగా రానున్నారు.