Connect with us

Featured

నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో ఇంజనీర్ ఉద్యోగాలు..!

Published

on

నోయిడాకు చెందిన హాస్పిటల్ సర్వీసెస్ కన్సలెన్సీ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 21 ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి నెల 1వ తేదీలోగా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హత ఆధారంగా భారీ వేతనం లభిస్తుంది.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల విద్యార్థుల విద్యార్హతలు, ఇతర వివరాలను బట్టి అభ్యర్థులను షార్ట్ లిస్టింగ్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు కేవలం ఆఫ్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. http://www.hsccltd.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

మొత్తం 21 ఉద్యోగాలలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్‌/ ఎల‌క్ట్రిక‌ల్‌/ మెకానిక‌ల్‌) ఉద్యోగాలు 20 ఉన్నాయి. కనీసం 60 మార్కులతో పాసై మూడు సంవత్సరాల అనుభవం, కంప్యూటర్ పై అవగాహన, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 సంవత్సరం జనవరి నాటికి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజినీర్ (ఆర్కిటెక్చ‌ర్‌) ఒక ఉద్యోగ ఖాళీ మాత్రమే ఉండగా ఆర్కిటెక్చ‌ర్ ‌లో కనీసం 60 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 సంవత్సరం జనవరి 1 నాటికి 24 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, హెచ్ఎస్‌సీసీ(ఇండియా) లిమిటెడ్‌, సెక్ట‌ర్‌-1, నోయిడా(యూపీ)-201301 అడ్రస్ కు అభ్యర్థులు అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, అనుభవాన్ని బట్టి ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 29,000 రూపాయల నుంచి 1,11,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.

Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!