Jabardasth Rohini: కెరియర్ మొదట్లో బుల్లితెర సీరియల్స్ లో నటించి తన భాషతో అందరిని ఆకట్టుకున్న బుల్లితెర నటి రోహిణి అందరికీ సుపరిచితమే.ఈమె పలు సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు.బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న రోహిణి ప్రస్తుతం వరుస టీవీ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు.

ఈ క్రమంలోనే ఈమె ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమం ద్వారా విపరీతమైన క్రేజ్ ఏర్పరచుకున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో రోహిణి అద్భుతమైన కామెడీ పంచులకు విపరీతమైన అభిమానులు ఉన్నారని చెప్పాలి. చాలామంది రోహిణి స్కిట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా ఈమె జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలలో సందడి చేస్తూ ఉన్నారు.

ఇలా బుల్లితెర కార్యక్రమాలతో పాటు సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకుంటారు. ఇక పోతే తన సొంత ఇంటి కల నెరవేరడంతో తన గృహప్రవేశానికి సంబంధించిన వీడియోని, హోమ్ టూర్ కూడా చేసి తన ఇంటిని చూపించారు. ప్రస్తుతం రోహిణి లండన్ టూర్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఆకట్టుకున్న 1000 ఏళ్ల పబ్…
ఈ క్రమంలోనే లండన్ టూర్ కి సంబంధించిన ఎన్నో ఆశక్తికరమైన ఫోటోలు, వీడియోలను నిత్యం అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే తాజాగా ఈమె లండన్ లో 1000 సంవత్సరాలనాటి పబ్ లోసందడి చేస్తూ ఆ పబ్ కు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియో ద్వారా పాత వస్తువులు జంతువుల గుర్తులు పబ్ లో దొరికే ఫుడ్ గురించి వివరిస్తూ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.