Jamuna: ఆ హీరో వల్ల దెబ్బ తిగిలి హెడ్ షేక్, వణుకు వచ్చాయి.. జమున వణుకుతూ మాట్లాడటానికి గల కారణం ఏంటో తెలుసా?

0
472

Jamuna: వెండితెర సత్యభామగా ఎంతో పేరు సంపాదించుకున్న జమున జనవరి 27వ తేదీ తన స్వగృహంలో మరణించారు. ఈమె అధిక వయోభారంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం ఉదయం తన స్వగృహంలోనే మరణించారు. ఈ విధంగా జమున మరణించడంతో ఆమె సినీ కెరియర్ గురించి పలువురు ఎన్నో విషయాలను తెలియజేశారు. అలాగే జమున గారితో వారికున్న అనుబంధం గురించి కూడా గుర్తు చేసుకున్నారు.

ఇకపోతే జమున వయసు పై పడే కొద్ది ఆమె ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా, ఎక్కడ మాట్లాడినా కూడా చాలా వణుకుతూ మాట్లాడేవారు. ఈ విధంగా జమున వనుకుతూ మాట్లాడటానికి గల కారణాన్ని కూడా తెలియజేశారు. 1965 వ సంవత్సరంలో జమున లేత మనసులు అనే సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను ప్రమాదానికి గురయ్యానని ఆ ప్రమాదంలో తాను చనిపోవాల్సిన పరిస్థితులు కూడా ఎదురయ్యాయని ఈమె తెలియజేశారు.

ఈ సినిమాలో జమున తమిళ హీరో జయశంకర్ తో కలిసి నటించారు. ఈ సినిమాలోని ఒక పాట షూటింగ్ గడ్డివాము పై జరిగింది. అయితే ఈ పాటకు రిహార్సల్స్ చేస్తున్న సమయంలో గడ్డివాము పై ఉన్నటువంటి హీరో జయశంకర్ ఒక్కసారిగా కిందపడ్డారు అయితే గడ్డివాము కింద ఉన్న తన తలపై పడటంతో ఒక్కసారిగా తనకు బాగా నొప్పి కలిగిందని ఈమె తెలియజేశారు. ఇలా ప్రమాదం జరిగిన వెంటనే తాను డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి ఐస్ పెట్టుకొని మెడ అటు ఇటు తిప్పి పరీక్షించుకున్నానని తెలిపారు.’

Jamuna: మెదడులోని నరం అతుక్కుపోవడమే కారణం..


అప్పట్లో ఇంత టెక్నాలజీ లేకపోవడం వల్ల ఏం జరిగింది అనే విషయాలు కూడా తెలిసేది కాదు అయితే తనకు బాగానే ఉందని సినిమాలు చేస్తూ ఉండేదాన్ని. రాజపుత్ర సినిమా చేస్తున్న సమయంలో తనలో ఈ వణుకు మొదలైందని అప్పటికి ఎక్స్ రేలు కూడా అందుబాటులోకి రావడంతో ఒకసారి తల మొత్తం పరీక్ష చేయించుకోగా మెదడులో ఒక చిన్న నరం అతుక్కుపోయిందని దానిని సర్జరీ చేయాలని చెప్పారు. అయితే ప్రస్తుతం తన పరిస్థితి బానే ఉంది కదా అని తాను సర్జరీ చేయించుకోలేదని జమున ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.