Hero Yash: కేజిఎఫ్ చిత్రం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు యశ్ గురించి అందరికీ సుపరిచితమే.ఈ చిత్రం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన ఈయన ఈ సినిమాతో హీరోగా మారి పోయారు.ఇక ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా తెరకెక్కిన కేజిఎఫ్ చాప్టర్ 2 చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇక ఈ సినిమా దేశవ్యాప్తంగా నేడు అత్యధిక థియేటర్లలో విడుదల అయ్యి ప్రీమియర్ షో తోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్ర బృందం అన్ని రాష్ట్రాల్లో పర్యటించి పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యశ్ టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లి షాలిని గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఒకరోజు ఎన్టీఆర్ తన ఇంటికి డిన్నర్ కు తనను ఆహ్వానించారని ఆరోజు ఎన్టీఆర్ కుటుంబం తనకిచ్చిన ఆతిథ్యం తన జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని వెల్లడించారు.
తనతో మంచి అనుబంధం ఉంది…
ఇక ఎన్టీఆర్ తల్లి గురించి కూడా మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఎన్టీఆర్ తల్లి షాలిని స్వస్థలం కనడ కావడంతో తనతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. తను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారని, తనది చాలా మంచి హృదయమని, నన్ను కూడా ఆ కుటుంబంలో ఒక వ్యక్తిగా ట్రీట్ చేశారని యశ్ ఎన్టీఆర్ తల్లి షాలిని గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాకుండా రామ్ చరణ్ తో కూడా తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని తెలిపారు.తను హైదరాబాద్లో షూటింగ్ లో పాల్గొంటే తప్పకుండా చరణ్ కుటుంబం నుంచి తనకు క్యారేజ్ వస్తుందని యశ్ వెల్లడించారు.































