సాయిధరమ్ తేజ్ ప్రమాదాన్ని స్పష్టంగా వివరించిన ఎన్టీఆర్‌ పీఆర్‌ఓ.. ఏం చెప్పాడంటే..

0
99

ఇటీవల మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు అపోలోలో చికిత్స పొందుతున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయిధరమ్ తేజ్ వైద్యానికి సహకరిస్తున్నారని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇటీవల అతడికి సర్జరీ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.

దీంతో ఆయన అభిమానులు, పరిశ్రమ వర్గాలు, బంధువులు పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే అతడు బైక్ రేస్ కారణంగానే ఇలా జరిగిందని కొందరు అంటుంటే.. మరికొంత మంది బైక్ మితిమీరిన వేగంతో నడపడం వల్ల ఇలా జరిగి ఉంటుందని మరికొందరు అంటుంన్నారు. ఇలా ఎవరు పడితే వాళ్లు మిడి మిడి జ్ఞానంతో చెబుతున్నారని.. ఇదంత అబద్దమని ఎన్డీఆర్ పీఆర్ఓ మహేష్ సోషల్ మీడియాలో మండిపడ్డాడు.

తేజ్‌కు ప్రమాదం ఎలా జరిగి ఉండొచ్చో వివరిస్తూ దానికి సంబంధించిన యాక్సిడెంట్‌ వీడియోని మహేష్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. అయితే ప్రమాదం అనేది ఎవరికైనా జరగొచ్చు. ఎటునుంచి ప్రమాదం వస్తుందో ఎవరికీ తెలియదని పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇసుక ఉంది.. అక్కడకు వచ్చిన వాహనాలు స్లోగా వెళ్తున్న క్రమంలో సాయి దానిని గమనిస్తూ.. అక్కడకు వచ్చి నెమ్మదిగా వెళ్లాలనుకున్నాడు.

దీంతో జారి కిందపడిపోయాడు. రోడ్డు సరిగా లేనందున ఇలా జరిగిందని.. ఓవర్‌ స్పీడ్‌ వల్ల మాత్రం కాదంటూ తెలిపాడు. అంతేగాని అతడు ఎలాంటి నియమాలను అతిక్రమించలేదని చెప్పాడు. ఏవేవో ఊహించుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి.. అతడి తల్లిదండ్రులను క్షోభకు గురిచేయొద్దని వేడుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here