ఆ పని చేసానని నా కుటుంబం నన్ను దూరం పెట్టింది.. వనితా విజయ్ కుమార్

0
367

ఒకప్పుడు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సినీ తారలు మంజుల, విజయ్ కుమార్ దంపతుల కుమార్తెగా.. దేవి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి వనిత. వ్యక్తిగత జీవితంలో ఫెయిల్యూర్ అయినా వనిత తన సినీ కెరీర్లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వనిత తన జీవితంలో జరిగిన సంఘటనలను గురించి తెలిపారు.

అతి చిన్న వయసులోనే మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి గల కారణం తన తల్లిదండ్రులులేనని, నా జీవితం ఇలా కావడానికి నా తల్లిదండ్రుల నుంచి లేదా చెల్లెలు ప్రీత, శ్రీదేవి సపోర్ట్ ఏమాత్రం లేదని తెలిపారు. తన చెల్లెలు జీవితాలు ఇప్పుడు సంతోషంగా ఉన్నాయంటే అందుకు కారణం కూడా తనేనని ఈ సందర్భంగా తెలిపారు.

సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరున్న మంజుల విజయ్ కుమార్ పెద్ద కూతురు వనిత ఇండస్ట్రీకి పరిచయమే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే కేవలం 18 సంవత్సరాలకి తనకు వివాహం చేశారు తనకు జీవితం అంటే ఏమీ తెలియని వయసులో పెళ్లి చేయడం వల్ల తరచు తన భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్ళేదాన్ని,అలా పుట్టింటికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రుల సపోర్ట్ లేని కారణంగా అతనితో తరచూ గొడవపడి మానసికంగా కృంగి పోవడం వల్లే విడాకులు తీసుకున్నానని తెలిపారు.

విడాకులు తీసుకుని ఇంటికి వచ్చినప్పుడు తమ తల్లిదండ్రులు మాకు పరువుపోతుందని ఇంటి నుంచి బయటకు పంపారని అందుకు తన ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లిన తనకి ఒక తోడు కావాలని భావించే తాను ప్రేమించిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నానని తెలిపారు. అదే సమయంలోనే మా నాన్న పిల్లల పెంపకం గురించి కేసు పెట్టడంతో రెండవ భర్త కూడా విడాకులు ఇచ్చినట్లు తెలిపారు.

ఇక మూడవ వివాహం గురించి చెప్పడానికి ఏమీ లేదు ప్రస్తుతం నా పరిస్థితి ఈ విధంగా ఉండటానికి గల కారణం కేవలం మా తల్లిదండ్రులు సపోర్ట్ లేకపోవడం వల్లనే, ఒకవేళ నాకు వారి మద్దతు ఉంటే నా జీవితం ఇంకోలా ఉండేదని తన జీవితంలో జరిగిన సంఘటనలను తలుచుకొని వనిత భావోద్వేగానికి లోనయ్యారు. తన చెల్లెల్ల వైవాహిక జీవితంలో ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళు సంతోషంగా ఉండడానికి కారణం కూడా నేనే.కానీ వాళ్లు కూడా నాతో మాట్లాడకపోవడం ఎంతో బాధాకరం అంటూ వనిత తెలిపారు.