ఏటీఎం సైజులో ఆధార్ కార్డు పొందే ఛాన్స్.. కేవలం 50 రూపాయలకే..?

0
197

భారతదేశంలో నివశించే వారికి ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమనే సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ఏ సంక్షేమ పథకానికి అర్హత పొందాలన్నా ఆధార్ కార్డ్ తప్పనిసరి అనే సంగతి తెలిసిందే. అయితే సాధారణంగా ఆధార్ కార్డ్ పెద్ద సైజులో ఉండటం వల్ల క్యారీ చేసే విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ల్యామినేషన్ లేని ఆధార్ కార్డును వినియోగిస్తే కొన్ని సందర్భాల్లో చిరిగిపోయే అవకాశం ఉంటుంది.

ఈ కార్డును పొందాలనుకుంటే మొదట https://uidai.gov.in/ వెబ్ సైట్ కు వెళ్లి get aadhar అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తరువాత order aadhaar pvc card అనే ఆప్షన్ ను ఎంచుకుని వివరాలను నమోదు చేసి ఏటీఎం సైజులో ఉండే ఆధార్ కార్డును పొందవచ్చు. రిజిష్టర్ మొబైల్ నంబర్ లేకపోయినా యూఐడీఐఏ ఆధార్ కార్డును పొందే అవకాశాన్ని కల్పిస్తూ ఉండటం గమనార్హం. వివరాలు నమోదు చేసి ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా 50 రూపాయలు చెల్లించాలి.

దరఖాస్తు చేసిన పది రోజుల తరువాత చిన్న సైజులో ఉండే ఆధార్ కార్డ్ ఇంటికి వస్తుంది. దరఖాస్తు చేసిన సమయంలో పేమెంట్ తరువాత వచ్చే రిసిప్ట్ లోని నంబర్ ద్వారా ఆధార్ కార్డ్ యొక్క స్టేటస్ ను తెలుసుకోవచ్చు. https://residentpvc.uidai.gov.in/order-pvcreprint ద్వారా కూడా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here