Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఈయనకి ఉన్నటువంటి క్రేజ్ మనకు తెలిసిందే. ఒకప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలోకి అడుగు పెట్టారు. ఇలా ఒక వైపు రాజకీయాలలో మరొకవైపు సినిమాలలోను నటిస్తూ పవన్ కళ్యాణ్ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇక హీరోలకి మంచి క్రేజ్ వచ్చిన తర్వాత ఎన్నో కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోట్ చేయాలి అంటూ పెద్ద ఎత్తున స్టార్ హీరోలు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ ఎలాంటి బ్రాండ్లను ప్రమోట్ చేయడం లేదు కానీ..కెరియర్ మొదట్లో ఈయన ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ అయినటువంటి పెప్సీ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేవారు.
ఇలా 2001వ సంవత్సరంలో ఈయన పెప్సీ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు అయితే అప్పట్లో ఈ యాడ్ చేసినందుకు ఈయనకు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చారు అనే విషయం గురించి తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అప్పట్లో ఈ యాడ్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ భారీగానే రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.

Pawan Kalyan: ఏకైక హీరో పవన్..
ఇలా పెప్సీ యాడ్ కు పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినందుకు ఈయనకు ఏకంగా 100 నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చారని గతంలో పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో తెలియజేశారు. అప్పట్లో ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్నటువంటి ఏకైక హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పాలి.ఇలా దాదాపు 20 సంవత్సరాల క్రితం పవన్ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్నారు అంటే ఈయన క్రేజ్ ఎలా ఉండేదో అర్థమవుతుంది.