షాకింగ్: పునీత్ ది హార్ట్ ఎటాక్ కాదు అసలేం జరిగిందో బయటపెట్టిన ఫ్యామిలీ డాక్టర్..!

0
52711

కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం సినీ పరిశ్రమని ఒక్కసారిగా శోకసంద్రంలోకీ నెట్టింది. ఆయన జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా హార్ట్ఎటాక్ వచ్చి ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటుండగానే ప్రాణాలు వదలడంతో హార్ట్ ఎటాక్ వల్ల చనిపోయారని తెలిపారు. కానీ పునీత్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విషయంపై పునీత్ ఫ్యామిలీ డాక్టర్ స్పందించారు. పునీత్ మామూలుగా ఎంతో ఆరోగ్యంగా చురుగ్గా ఉండేవారని ఆయనకు గుండెపోటు రావడానికి గల కారణాలు చెప్పడం అసాధ్యమని డాక్టర్ తెలిపారు. పునీత్ చనిపోయే రోజు ఉదయం తన భార్యతో కలిసి హాస్పిటల్కి వచ్చారని, కాస్త నలతగా ఉండి డాక్టర్ ఏమిటో చూడండి అనగానే.. డాక్టర్ ఆ మాట విని ఆశ్చర్యపోయాడట.

ఎందుకంటే పునీత్ హెల్త్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు తెలిపారు డాక్టర్. ఇక డాక్టర్ దగ్గరికి వచ్చే సమయానికి పునీత్ కు చెమటలు కారిపోతున్నాయట.జిమ్లో వర్కవుట్ చేసినప్పుడు చెమటలు రావడం సాధారణమని డాక్టర్ రమణరావు తెలిపారు. ఏదైనా మంచిది అని ఈసీజీ పరీక్షలు చేస్తే అందులో ఒక స్ట్రెయిన్ కనిపించిందని అందుకే అన్ని సౌకర్యాలున్న విక్రమ్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారట.

ఇక పునీత్ ఆయన భార్య కారు ఎక్కగానే డాక్టర్ గారు విక్రమ్ ఆస్పత్రికి కాల్ చేసి ఐసీయూ సిద్ధం చేయాలని చెప్పారట. వెంటనే అక్కడికి చేరుకున్నప్పటికీ అతడిని బతికించుకునే లేకపోయాను అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పునీత్ చనిపోవడం అనేది ఒక హఠాత్పరిణామం, ఇది గుండెపోటు కాదు, కార్డియాక్ అరెస్ట్ అనీ డాక్టర్ తెలిపారు. అంత్యక్రియలు నేడు జరగబోతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here